Black Fungus: బాబోయ్ బ్లాక్ ఫంగస్... ఇప్పుడు ఇలా కూడా వ్యాపిస్తోందా?

బాబోయ్ బ్లాక్ ఫంగస్... ఇప్పుడు ఇలా కూడా వ్యాపిస్తోందా? (ప్రతీకాత్మక చిత్రం)

Black Fungus: ఇండియాలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దారుణమైన విషయమేంటంటే... ఇప్పుడు ఈ వ్యాధి కూడా కొత్తకొత్తగా వ్యాపిస్తోంది. ఇదో పెను సమస్యగా మారనుందా?

 • Share this:
  Black fungus: ఓవైపు కరోనా మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు. ఈ బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్ - Mucormycosis) కేసులు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో... ఇద్దరు వ్యక్తులు కడుపునొప్పితో చేరారు. వారిని స్కాన్ చెయ్యగా... పొట్టలోని చిన్న పేగుల్లో బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు తెలిసింది. ముక్కు, కళ్లలో కనిపించే ఈ ఫంగస్... చిన్న పేగుల్లో కనిపించడం అరుదైన విషయం అని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పేషెంట్లకూ కరోనా ఉంది. వారిలో కుమార్ వయసు 56 ఏళ్లు. ఢిల్లీ వాసి. తన భార్యకు అంత్యక్రియలు పూర్తి చేశాక... కడుపులో నొప్పి వచ్చింది. ఇప్పటికే భార్య సహా... తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన ఆయనకు... భార్యతోపాటే కరోనా సోకింది. లక్షణాలు తక్కువగానే కనిపించాయి. కడుపులో నొప్పి వస్తే... గ్యాస్ ట్రబుల్ కావచ్చని... ఏసీడీటీ మందులు వాడాడు. మూడు రోజులైంది. సీటీ స్కాన్ చెయ్యగా... చిన్న పేగు మొదటి భాగం (Jejunum)కి చిల్లులు (కన్నాలు) ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు కరోనా కూడా తీవ్రం అయ్యింది. వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అయ్యింది.

  మరో కేసులో 68 ఏల్ల ఇజాజ్... తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని వేడుకలు చేసుకున్నారు. ఆ తర్వాత... పొట్టలో చిన్నగా నొప్పి మొదలైంది. ఆయన డయాబెటిక్ పేషెంట్. కరోనా ట్రీట్‌మెంట్ కోసం స్టెరాయిడ్లు వాడారు. ఆయనకు సీటీ స్కాన్ చెయ్యగా... అందులోనూ చిన్న పేగు ప్రారంభంలో చిల్లులు పెట్టేసినట్లు కనిపించింది.

  ఈ బ్లాక్ ఫంగస్ అనేది... ఊపిరి తిత్తులను పాడుచేస్తుంది. చిన్న పేగుల జోలికి రావడం అనేది అరుదైన ఘటనగా సర్ గంగా రామ్ హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఈ ఆస్పత్రిలో 60కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి.

  బ్లాక్ ఫంగస్ - కేంద్రం సూచనలు:
  - బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్లకే (వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి) సోకుతుంది.
  - ఇది సోకితే... శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది.
  - దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే... వొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడే వారికి, ICUలో ఎక్కువ కాలం ఉండే వారికి ఇది సోకగలదు.

  బ్లాక్ ఫంగస్ లక్షణాలు (Symptoms of Mucormycosis):
  - కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. నాలికపై నల్లటి మచ్చలు ఉంటే... వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
  - ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే... ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు.

  ఇది కూాడా చదవండి: Andhra Chicken recipe: ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ... ఈ టేస్ట్ లైఫ్‌లో మర్చిపోలేరు

  ఈ వ్యాధి సోకితే... 24 గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్... ఎముకలను కూడా తినేయగలదు. ఇది తిన్నగా బ్రెయిన్‌ను దెబ్బతీసి... రోగిని చంపేయగలదు. వెంటనే ట్రీట్‌మెంట్ అందిస్తే... రోగిని బతికించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కేంద్రం యాంఫోటెరిసిన్ B (Amphotericin B) అనే మందును ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ మందు ఎలా వాడాలో డాక్టర్లు డిసైడ్ చేస్తారు. సరైన టైమ్‌కి ఈ మందు వాడితే... బ్లాక్ ఫంగస్ గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోతుంది.
  Published by:Krishna Kumar N
  First published: