Black Fungus: బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడానికి అదే కారణమా... జరుగుతున్న పరిశోధన

Black Fungus: బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడానికి అదే కారణమా... జరుగుతున్న పరిశోధన (ప్రతీకాత్మక చిత్రం)

Black Fungus: ప్రపంచ దేశాల్లో ఎక్కడా రాని బ్లాక్ ఫంగస్ కేసులు ఇండియాలోనే ఎందుకొస్తున్నాయి? సంథింగ్ ఎక్కడో తేడా కొడుతోంది కదా... దాని సంగతి తేల్చే పని మొదలైంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Black Fungus: బ్లాక్ ఫంగస్ అనేది ఇండియాలోనే కాదు... ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉంది. గాలిలో గాలిలా తిరుగుతూ ఉంది. మరి ఈ బ్లాక్ ఫంగస్ భారతీయులకే ఇంతలా ఎందుకు సోకుతోంది... అమెరికన్లు, బ్రిటన్, బ్రెజిల్, చైనా ఇలా ఏ దేశంలోనూ ఈ కేసులు ఎందుకు ఇంతలా రావట్లేదు... ఇదే డౌట్... కర్ణాటక ప్రభుత్వానికి వచ్చింది. అసలు కరోనా పేషెంట్లకు నాణ్యత లేని ఆక్సిజన్ వాడటం వల్లే ఇలా జరిగిందా అనే డౌట్ వచ్చింది. యడ్యూరప్ప ప్రభుత్వం వెంటనే దర్యాప్తుకి ఆదేశించింది. ఆక్సిజన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది... అది నాణ్యతతో ఉందా లేదా... ఆక్సిజన్ సిలిండర్లు నాణ్యతతో ఉన్నాయా.... అనే అంశాలపై మైక్రోబయాలజిస్టుల టీమ్ నేటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ ఫంగస్ సోకిన అందరు పేషెంట్ల క్లినికల్ హిస్టరీని చెక్ చేస్తోంది. వారికి ఆక్సిజన్ ఎక్కడెక్కడి నుంచి తెప్పించినదీ పరిశీలిస్తోంది. చాలా మంది పేషెంట్ల బంధువులు... సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకున్నారు. వారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో ఈ టీమ్ పరిశీలిస్తోంది.

    ఆక్సిజన్ నాణ్యమైనది కాకపోవడం వల్లే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూ ఉండొచ్చని డాక్టర్లు డౌట్ వ్యక్తం చేశారు. ఆశ్చర్యపోయిన ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వంత్ నారాయణ్... దర్యాప్తుకి ఆర్డరేశారు. ఈయన కోవిడ్ టాస్క్ ఫోర్స్‌కి హెడ్డుగా కూడా పనిచేస్తున్నారు. ఆక్సిజన్ మాత్రమే కాదు... ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వచ్చే పైపులు, ఆక్సిజన్ తెచ్చే సిలిండర్లు, ఆక్సిజన్ ప్లాంట్లలో వాడే నీరు అన్నింటినీ ఇప్పుడు పరిశీలించే పనిలో పడింది టీమ్. వీటిలో ఎక్కడో ఒక చోట బ్లాక్ ఫంగస్ ఉండి ఉండొచ్చనే అనుమానం వారికి ఉంది.

    జనరల్‌గా మన దేశంలో సంవత్సరానికి 100 బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రమే వచ్చేవి. ఇప్పుడో... రోజుకు వందకు పైగా వస్తున్నాయి. ఎలాంటి దేశం ఎలా అయిపోయిందో చూడండి. ఒక్క కర్ణాటకలోనే... గత వారం 700 కేసులు వచ్చాయి. అక్కడి అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలే కర్ణాటకలో కరోనా విపరీతంగా ఉంది. దానికి ఇది తోడైంది. ఇటు కరోనా పేషెంట్లు, అటు బ్లాక్ ఫంగస్ పేషెంట్లు... డాక్టర్లకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. బుర్రలు బద్ధలైపోతున్నాయి.

    ఇది కూడా చదవండి: Covid: ఇండియాలో 3 లక్షలు దాటిన కరోనా మరణాలు... మళ్లీ పెరిగిపోయాయిగా...

    అసలే మన దేశంలో ఆస్పత్రుల్లో నాణ్యత అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్ లేని చోటు అంటూ ఉండదు. కాబట్టి... ఎక్కడో ఒక చోట ఇది వ్యాపించేందుకు అవకాశాలు బలపడ్డాయని భావిస్తున్నారు. దర్యాప్తు చేసి... రిపోర్ట్ ఇచ్చాక గానీ వాస్తవం తెలియదు. వాళ్ల అనుమానమే నిజమైతే... అర్జెంటుగా దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో క్వాలిటీ చెకప్స్ చెయ్యాల్సి ఉంటుంది. అలాగే ఆక్సిజన్ ప్లాంట్లను కూడా చెక్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది మరో పెద్ద తలనొప్పి అవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: