కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే..'మీటూ' బాధితులవడం ఖాయం: రాజ్‌నాథ్

మహాకూటమి ఏర్పాటుటో బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు లేవని..కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలే మోసపోతాయని అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేవైఎం యూత్ కన్వెన్షన్‌ను రాజ్‌నాథ్ ప్రారంభించారు.

news18-telugu
Updated: October 27, 2018, 10:56 PM IST
కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే..'మీటూ' బాధితులవడం ఖాయం: రాజ్‌నాథ్
రాజ్‌నాథ్ సింగ్ (twitter.com/BJP4India)
  • Share this:
కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేసే పార్టీలు.. 2019 ఎన్నికల తర్వాత మీటూ ఉద్యమం చేస్తారని హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ మోసాలకు బాధితులవడం ఖాయమని చురకలంటించారు.  విపక్షాలు సిద్ధాంతపరంగా ఒక్కవటం లేదని.. కేవల మోదీని ఓడించాలనే లక్ష్యంతోనే చేతులు కలుపుతున్నారని ధ్వజమెత్తారు. మహాకూటమి ఏర్పాటుటో బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు లేవని..కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలే మోసపోతాయని అన్నారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న బీజేవైఎం యూత్ కన్వెన్షన్‌ను రాజ్‌నాథ్ ప్రారంభించారు. అనంతరం నేతలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

2019 ఎన్నికల్లో విపక్షాలకు ఎలాంటి అజెండా లేదు. మోదీని గద్దె దింపాలన్న లక్ష్యం మాత్రమే పెట్టుకున్నారు. విపక్ష పార్టీలకు నేనొక విషయం చెప్పదలచుకున్నా. జాగ్రత్తగా వినండి. ఎన్నికల తర్వాత ఆయా పార్టీలను కాంగ్రెస్ నయవంఛన చేస్తుంది. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే పార్టీలను ఈ భూమిపై ఉన్న ఏ శక్తీ కాపాడలేదు. తమను కాంగ్రెస్ మోసం చేసిందంటూ.. ఎన్నికల తర్వాతవారంతా మీటూ ఉద్యమం ప్రారంభిస్తారు.
రాజ్‌నాథ్ సింగ్, కేంద్రహోంమంత్రి
స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ యువతకు పిలుపునిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 350 సీట్లు వచ్చేలా శ్రమించాలని కోరారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని రాజ్‌నాథ్ ధ్వజమెత్తారు. బీజేవైఎం మహాసభలకు బీజేవైఎం ప్రెసిడెంట్ పూనమ్ మహాజన్, పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆదివారం అమిత్ షా పాల్గొని ముగింపు ప్రసంగం చేయనున్నారు.

Published by: Shiva Kumar Addula
First published: October 27, 2018, 7:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading