హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

లండన్ ఎంబీసీ ఘటనపై బీజేపీ నేత మజిందర్ సింగ్ సీరియస్..సిక్కులు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపు

లండన్ ఎంబీసీ ఘటనపై బీజేపీ నేత మజిందర్ సింగ్ సీరియస్..సిక్కులు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపు

ఆందోళన చేస్తున్న సిక్కులు (Pc: Twitter/ Manjinder Singh Sirsa)

ఆందోళన చేస్తున్న సిక్కులు (Pc: Twitter/ Manjinder Singh Sirsa)

London: లండన్ లో భారతీయ జెండాకు అవమానం జరిగింది. నిన్న భారత్ హైకమీషన్ కార్యాలయానికి చేరుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు భారత జెండాను కిందకు లాగారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. హైకమీషన్ వద్ద భద్రత కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ నాయకుడు మజిందర్ సింగ్ సిర్సా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు దైర్యం, దేశభక్తి, సంఘీభావానికి పేరు గాంచిన సిక్కు సమాజం పరువు తీస్తాయని అన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

London: లండన్ లో భారతీయ జెండాకు అవమానం జరిగింది. నిన్న భారత్ హైకమీషన్ కార్యాలయానికి చేరుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు భారత జెండాను కిందకు లాగారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. హైకమీషన్ వద్ద భద్రత కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా పంజాబ్ దే సంస్థ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం సెర్చ్ చేస్తుండడం..అతని మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో లండన్ లో పలువురు ఖలిస్థాన్ మద్దతుదారులైన సిక్కులు నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో భారత్ హైకమీషన్ పై దాడి చేసి జెండాను తొలగించారు.

Agriculture: కేవలం సెంటు భూమిలో మొక్కల సాగు.. నెలకు లక్ష సంపాదిస్తున్న రైతు

ఇక ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ నాయకుడు మజిందర్ సింగ్ సిర్సా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు దైర్యం, దేశభక్తి, సంఘీభావానికి పేరు గాంచిన సిక్కు సమాజం పరువు తీస్తాయని అన్నారు. త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచిన కొంతమంది హేళనాత్మక చర్యను బహిరంగంగా ఖండించాలని..ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న సిక్కులను నేను వినమ్రంగా కోరుతున్నానని ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మనమంతా ఒక్కటై ముక్తకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

The Vial: ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ జర్నీపై హిస్టరీ TV18 స్పెషల్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ విడుదల

ఈ ఘటన నేపథ్యంలో బ్రిటిష్ హైకమీషన్ వద్ద సిక్కులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని, ఫ్లకార్డులను పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. 'భారత్ హుమారా స్వాభిమాన్ హై' అంటూ నినాదాలు చేశారు. భారతీయ జెండాను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. లండన్ ఘటనపై సిక్కులు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఘటనపై భారతీయులు మండిపడుతున్నారు. ఇప్పటికే భారతీయ జెండాను అగౌరపరచడంపై యూకే సీనియర్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

First published:

Tags: India, London, National flag

ఉత్తమ కథలు