క్లైమాక్స్‌కి మహారాష్ట్ర కహానీ... శివసేన సర్కార్ ఏర్పడే ఛాన్స్

Maharashtra CM | మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న శివసేన... వేగంగా పావులు కదుపుతోంది. ఇవాళ మేటర్ ఆటో ఇటో తేలిపోవడం ఖాయం.

news18-telugu
Updated: November 11, 2019, 6:07 AM IST
క్లైమాక్స్‌కి మహారాష్ట్ర కహానీ... శివసేన సర్కార్ ఏర్పడే ఛాన్స్
శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఫడ్నవీస్
  • Share this:
Maharashtra CM | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందా? రాష్ట్రపతి పాలన వస్తుందా అన్నది ఇవాళ తేలనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ క్లారిటీగా చెప్పేయడంతో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో లేదో నేటి రాత్రి 7.30లోపు చెప్పాలన్నారు. శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే... శివసేనతో కలిసేందుకు ఎన్సీపీ కొన్ని షరతులతో ఓకే అంటోంది. అదే సమయంలో... కాంగ్రెస్ కొన్ని షరతులతో బయటి నుంచీ మద్దతిస్తామని అంటోంది. అందువల్ల శివసేన తగినంత సంఖ్యాబలం లేకపోయినా... మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఐతే... మొన్నటి ఎన్నికల ప్రచారంలో శివసేన, ఎన్సీపీ అత్యంత దారుణంగా దుమ్మెత్తి పోసుకున్నాయి. ఇప్పుడా రెండు పార్టీలూ చేతులు కలిపితే... ప్రజాస్వామ్యానికి అంతకంటే దారుణం ఇంకోటి ఉండదని బీజేపీ ఫైర్ అవుతోంది. దమ్ముంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యమని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్... శివసేనకు సవాల్ విసిరారు.

తాజా లెక్కల్ని ఓసారి చూద్దాం : మహారాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య 288. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 145. బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. శివసేనకు 56 స్థానాలు దక్కాయి. అవి రెండూ కలిసి ఉండి ఉంటే... అవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి. ఇప్పుడు సీన్ మారింది కాబట్టి... బీజేపీని పక్కన పెడదాం. ఎన్సీపీకి 54 సీట్లు రాగా... కాంగ్రెస్‌కి 44 వచ్చాయి. అందువల్ల శివసేన ఎన్సీపీ కలిస్తే (56+54) మొత్తం సీట్ల సంఖ్య 110 అవుతుంది. కాంగ్రెస్ బయటి నుంచీ మద్దతిస్తానంది కాబట్టి... కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వ సంఖ్యా బలం (110+44) 154 అవుతుంది. అందువల్ల శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

కండీషన్ల సంగతేంటి : శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే... సీఎం సీటుపై కన్నేశారు. అందువల్ల ఆ సీటుపై ఆయనే కూర్చునే అవకాశాలు ఉన్నాయి. నెక్ట్స్ ఉప ముఖ్యమంత్రి సీటుపై ఎన్సీపీ కన్నేసింది. అందువల్ల ఆ సీటును ఎన్సీపీకి ఇచ్చే ఛాన్సుంది. అదే జరిగితే... ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొడుకు అజిత్ పవార్... డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్సుంది.

అలాగే ఎన్సీపీ... శివసేన NDA నుంచీ బయటకు రావాలనే కండీషన్ కూడా పెట్టింది. ఇదేం పెద్ద మేటర్ కాదు. అవతల సీఎం సీటు రెడీగా ఉంటే... NDAకు గుడ్ బై చెప్పేందుకు శివసేన ఆలోచిస్తుందని మనం అనుకోవాల్సిన పని లేదు. సో... NCP కండీషన్లను శివసేన ఒప్పుకొని అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు నరేంద్రమోదీ కేబినెట్‌లోని శివసేన మంత్రి రాజీనామా చేస్తారు.

కాంగ్రెస్ కూడా ఓ కండీషన్ పెట్టింది. ఏంటంటే... స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంది. అందుకు శివసేన ఒప్పుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే... బలపరీక్ష టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొడతారు. అప్పుడు సభలో సభ్యుల సంఖ్య తగ్గి... శివసేన-ఎన్సీపీ ప్రభుత్వం గట్టెక్కే అవకాశాలు కొంతవరకూ ఉంటాయి.

 

Pics : నహిద బ్రైడల్ మేకప్‌ చూసి తీరాల్సిందే


ఇవి కూడా చదవండి :

ఏపీని ఆత్మహత్యలప్రదేశ్ చేశారు... వైసీపీపై చంద్రబాబు సెటైర్లు

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు


Health Tips : వట్టి వేర్లతో ప్రయోజనమేంటి? తెలుసుకుందాం

1.2 కేజీల పీత... ఎంతకు అమ్ముడైందో తెలిస్తే షాకే...

గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్‌లో అదే చర్చ
First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading