Home /News /national /

BJPS RAHUL NARWEKAR ELECTED NEW MAHARASHTRA ASSEMBLY SPEAKER PAH

Maharashtra: మహారాష్ట్ర లో పూర్తయిన మరో ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన రాహుల్ నర్వేకర్..

రాహుల్ నర్వేకర్ (ఫైల్)

రాహుల్ నర్వేకర్ (ఫైల్)

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో.. కొత్త స్పీకర్ గా.. షిండే ఎమ్మెల్యేల మద్దతు, బీజేపీ సపోర్ట్ తో రాహుల్ నార్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యారు.

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు వానాకాలంలో హీట్ ను పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి బ‌రిలో దిగిన రాహుల్ నర్వేకర్ (Rahul narwekar)  164 ఓట్లు వచ్చాయి. అదే విధంగా ఆయన ప్రత్యర్థి.. శివ‌సేన నుంచి ఎంవీఏ త‌రుఫున పోటీలో ఉన్న రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి. బీజేపీ సహకారంతో.. కొత్తగా ఎన్నికైన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో సహాకరంతో నర్వేకర్ స్పీకర్ (speaker)  ఎన్నికయ్యారు. అయితే, వీరిద్దరిలో రాహుల్ నర్వేకర్ కు అధికంగా ఓట్లు వచ్చాయి.

మహా రాజకీయాలలో కొన్ని రోజులుగా నిముష నిముషానికి రాజకీయాలు మారిపోతున్నాయి. ఏక్ నాథ్ షిండే, శివసేన నుంచి అనూహ్యంగా విడిపోవడం, అదే విధంగా.. రెబెల్ ఎమ్మెల్యేల సపోర్ట్, బీజేపీ సహాకారంతో ఏక్ నాథ్ షిండే కొత్త సీఎంగా అవతరించడం అన్ని వెనువెంటనే జరిగిపోయాయి.



ఇదిలా ఉండగా  మ‌హారాష్ట్ర(Maharashtra)సంక్షోభం ముగిసినా వాటి ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి.

తాజాగా శివసేన ఎంపీ,మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రధాన అనుచరుడు సంజయ్ రౌత్(Sanjay Raut)సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కార్ కూలిపోయి షిండే సీఎం అయిన కొద్ది రోజులకే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశనీయంగా మారాయి. జూన్ 29న, ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు మరియు మరుసటి రోజు, ఏక్నాథ్ షిండే రాష్ట్ర సీఎం పదవిని చేపట్టారు.

అయితే షిండే సీఎం పదవి చేపట్టడానికి ముందే..అసోంలోని గౌహతిలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి రావాల‌ని త‌న‌కు కూడా ఆఫ‌ర్ వచ్చిందని సంజయ్ రౌత్ తెలిపారు. తాను బాలాసాహెబ్ ఠాక్రే అనుయాయుడ‌ని చెబుతూ ఆ ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చాన‌ని చెప్పారు. రూ.1,034 కోట్ల విలువైన పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు హాజరైన అనంతరం రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి త‌ప్పూ చేయ‌లేద‌ని అందుకే తాను ఈడీ ఎదుట ఆత్మ‌విశ్వాసంతో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాన‌ని రౌత్ పేర్కొన్నారు.

పది గంటల విచారణ అనంతరం తిరిగి బయటకు వచ్చానని చెప్పారు. మన వైపు నిజం ఉన్నప్పుడు బయపడాల్సిన అవసరం ఏముందన్నారు. శివసేన ఉద్ధవ్‌ ఠాక్రేతోనే ఉందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే శివ‌సేన సీఎం కాద‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే స్ప‌ష్టంగా చెప్పార‌ని అన్నారు. ముంబైలో శివ‌సేన ఉనికిని త‌గ్గించేందుకే త‌మ పార్టీని దెబ్బ‌తీయాల‌ని కాషాయ పార్టీ వ్యూహంలో భాగంగా ఇదంతా జ‌రిగింద‌ని షిండే తిరుగుబాటును ఉద్దేశించి రౌత్ అన్నారు. శుక్ర‌వారం జ‌రిగిన శివ‌సేన ఎంపీల స‌మావేశానికి 18 మంది ఎంపీల‌కు గాను 15 మంది హాజ‌ర‌య్యార‌ని చెప్పారు. నిజ‌మైన శివ‌సైనికులు ఎవ‌రూ ప్ర‌లోభాల‌కు లోనుకార‌ని, ఉద్ధ‌వ్ ఠాక్రేదే నిజ‌మైన శివ‌సేన‌ని స్ప‌ష్టం చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Eknath Shinde, Maharashtra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు