వాళ్లకి ఓటయమంటావా ? ఎన్నికల అధికారిపై బీజేపీ కార్యకర్తల దాడి

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని ఓ పోలింగ్ ‌బూత్ అధికారిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.

news18-telugu
Updated: April 23, 2019, 11:32 AM IST
వాళ్లకి ఓటయమంటావా ? ఎన్నికల అధికారిపై బీజేపీ కార్యకర్తల దాడి
ఎన్నికల అధికారిపై దాడి చేస్తున్న బీజేపీ కార్యకర్తలు
news18-telugu
Updated: April 23, 2019, 11:32 AM IST
లోక్‌సభ మూడో దశ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. బూత్ నంబర్ 231లో ఓ అధికారి సమాజ్‌వాదీ పార్టీకి వేయాలని ఓటర్లను కోరుతున్నాడని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకుని ఆ అధికారిపై దాడి చేశారు. అతడిని పోలింగ్ బూత్ నుంచి బయటకు తీసుకొచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పలువురు బీజేపీ కార్యకర్తలు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొచ్చారు.
గత ఎన్నికల్లో మొరాదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కున్వర్ సర్వేశ్ కుమార్ సింగ్ సమాజ్ ‌వాదీ పార్టీ అభ్యర్థి ఎస్.టి. హసన్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తరపున సర్వేశ్ కుమార్ మరోసారి ఎంపీగా పోటీ చేస్తుండగా... ఎస్పీ-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఎస్.టి.హసన్ పోటీ చేస్తున్నారు.


First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...