హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

జమ్మూకాశ్మీర్‍‌లో టెన్షన్... దుండగుల కాల్పుల్లో బీజేపీ నేత మృతి... ఏం జరుగుతోంది?

జమ్మూకాశ్మీర్‍‌లో టెన్షన్... దుండగుల కాల్పుల్లో బీజేపీ నేత మృతి... ఏం జరుగుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈమధ్య కాస్త సైలెంటైనట్లు కనిపించిన జమ్మూకాశ్మీర్లో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. ఏదో జరుగుతోంది. ఇండియన్ ఆర్మీ దీనిపై దృష్టి సారిస్తోంది.

  జమ్మూకాశ్మీర్ లోని బీజేపీ బడ్గామ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అబ్దుల్ హమీద్ నజర్. ఆదివారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ కి వెళ్లినప్పుడు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 38 ఏళ్ల హమీద్ ను శ్రీ మహారాజ హరి సింగ్ ఆస్పత్రికి తరలించారు.... సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు తెలిసింది. బీజేపీ OBC మోర్చాగా ఉన్న హమీద్ పై కాల్పులు జరిపింది ఎవరన్నది తెలియట్లేదు. గత ఐదు రోజులు బీజేపీ నేతలపై జరిగిన మూడో దాడి ఇది. తాజా కాల్పుల ఘటన తర్వాత... గత 24 గంటల్లో బీజేపీకి చెందిన 8 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. ఓ బీజేపీ నేత.. ఇక తాను పార్టీ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేననీ, దీనిపై ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి అని సోషల్ మీడియా లో లెటర్ పెట్టారు. గత నెల రోజులుగా ఇలా 17 మంది బీజేపీ నాయకులు కాశ్మీర్ లో రాజీనామాలు చేశారు.

  ఈమధ్య బీజేపీ వర్కర్ వసీం బారీ, అతని తండ్రి, సోదరుణ్ని ఉత్తర కాశ్మీర్... బందీపురాలో దుండగులు కాల్చి చంపారు. అప్పటి నుంచి బీజేపీ నేతలకు ప్రాణభయం పట్టుకుంది. తాము బీజేపీ నేతలకు, వర్కర్లకు తగిన భద్రత కల్పిస్తున్నామనీ... రాజీనామా చేసిన వాళ్లంతా అవకాశవాదులేనని బీజేపీ జమ్మూ కాశ్మీర్ ఉపాధ్యక్షుడు సోఫీ యూసఫ్ అన్నారు.

  ఏడాది కాలంలో ఇలాంటి ఘటనలు కొన్ని జరగడంతో 400 మంది పార్టీ వర్కర్లను ప్రత్యేక హోటళ్లకు తరలించి... భద్రత కల్పిస్తున్నారు. బందీపురా ఘటన తర్వాత 25 మందికి అదనపు భద్రత కల్పించినట్లు తెలిపారు.

  అసలు కాల్పులు జరుపుతున్నది ఎవరు? ఎందుకు చంపుతున్నారు? అన్నది తేలట్లేదు. ఉగ్రవాదులే కావచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇండియాలో స్లీపర్ సెల్స్ లా తిరుగుతున్నారనే వాదన ఉంది. పోలీసులు, ఆర్మీ దీనిపై దృష్టి సారిస్తోంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Jammu and Kashmir

  ఉత్తమ కథలు