హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi: మహిళా ఎమ్మెల్యేకు ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్

Rahul Gandhi: మహిళా ఎమ్మెల్యేకు ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్

ఎమ్మెల్యే దివ్య మడెర్నాతో రాహుల్ గాంధీ

ఎమ్మెల్యే దివ్య మడెర్నాతో రాహుల్ గాంధీ

Rahul Gandhi: బీజేపీ నేత ట్వీట్‌కి దివ్య మడెర్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఏడు క్యాప్షన్స్ ఇచ్చి బీజేపీపై ఎదురు దాడికి దిగారు. రాహుల్ గాంధీ తన సంరక్షకుడు, గురువు, అన్నయ్య, దయ కలిగిన నాయకుడు అని పేర్కొన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో కొనసాగుతోంది. ఐతే ఇటీవల ఆయన రాజస్థాన్‌(Rajasthan)కు చెందిన మహిళా కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే  దివ్య మహిపాల్ మడెర్నా(Divya Mahipal Maderna)ను ముద్దుపెట్టడంపై దుమారం రేగుతోంది. దివ్యను తలపై రాహుల్ ముద్దుపెట్టిన ఫొటోను బీజేపీ నేత అరుణ్ యాదవ్ పోస్ట్ చేశారు. దీనికి బెస్ట్ క్యాప్షన్ చెప్పాలని నెటిజన్లను అడిగారు. ఆయన ట్వీట్‌తో బీజేపీ (BJP), కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

  ఆ ట్వీట్‌పై దివ్య మడెర్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఏడు క్యాప్షన్స్ ఇచ్చి బీజేపీపై ఎదురు దాడికి దిగారు. రాహుల్ గాంధీ తన సంరక్షకుడు, గురువు, అన్నయ్య, దయ కలిగిన నాయకుడు అని పేర్కొన్నారు. నిన్ను సిగ్గేస్తుందని.. మీకు కూడా కూతురు, భార్య, తల్లి ఉంటుంది కదా.. అని మండిపడ్డారు. వ్యక్తిత్వాన్ని కించపరిచడం ఆపాలంటూ విరుచుకుపడ్డారు.

  Amit Shah: లచిత్ బోర్ఫుకాన్‌కు హోంమంత్రి అమిత్ షా నివాళులు.. , ఆయన లేకుంటే మరోలా ఉండేదం

  భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో జరుగుతున్న సమయంలో ఓసియన్ (రాజస్థాన్) ఎమ్మెల్యే దివ్య మహిపాల్ మడెర్నా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో నడిచారు. ఆ సందర్భంగా దివ్య తలపై ముద్దుపెట్టారు. ప్రస్తుతం ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  కాగా, తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ మొదలుపెట్టిన భారత్ జోడోయాత్ర.. కేరళ , కర్నాటక,ఏపీ, తెలంగాణ , మహారాష్ట్ర సాగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. అనతరం యూపీ, రాజస్థాన్ , ఢిల్లీ, పంజాబ్ , హర్యానా మీదుగా.. జమ్మూకాశ్మీర్ వరకు ఉంటుంది. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. ప్రజల  సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bharat Jodo Yatra, Congress, Rahul Gandhi