Home /News /national /

BJP WIN MAJORITY SEATS IN BY ELECTIONS AND WIN BIHAR ASSEMBLY ELECTIONS SAYS LANKA DINAKAR AK

మిని ఎన్నికల మహభారత సంగ్రామం... ఆ రాష్ట్రాల్లోనూ బీజేపీకి సానుకూలం

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

నరేంద్రమోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

BJP: బీహర్ అసెంబ్లీ ఏన్నికలు, మధ్యప్రదేశ్ మరియ గుజరాత్ ఉప ఏన్నికల ప్రాముఖ్యత ఏంత సంతరించుకున్నదో, తెలంగాణలో దుబ్బాక ఉప ఏన్నిక అంతే ప్రాధాన్యత సంతరించుకుంది.

  దేశంలో బీహర్ అసెంబ్లీ ఏన్నికలతోపాటు మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, మణిపూర్ తదితర రాష్ట్రాలలో 58 అసెంబ్లీ స్థానాల ఉప ఏన్నికలు మిని ఏన్నికల మహభారత సంగ్రామాన్ని తలపించాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా, బీహర్ అసెంబ్లీ ఏన్నికలు, మధ్యప్రదేశ్ మరియ గుజరాత్ ఉప ఏన్నికల ప్రాముఖ్యత ఏంత సంతరించుకున్నదో, తెలంగాణలో దుబ్బాక ఉప ఏన్నిక అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా, బీహర్ అసెంబ్లీ ఏన్నికల ముందు వాతావరణం ఏన్డీఏకు ప్రతికూల ప్రచారం బాగా జరిగింది. అన్ని మీడియా మధ్యమాలు ఏకోన్ముకంగా తేజశ్వి యాదవ్ బీహర్ ముఖ్యమంత్రి అన్నారు.

  అలాగే స్థానిక దుబ్బాక శాసనసభ ఎమ్మెల్యే మరణంతో తెలంగాణలో జరిగిన ఉప ఏన్నికలో కూడ సానుభూతి పవనాల అంచనాలు అధికారపార్టీ మెజార్టీ పై ఉహగానాలు అంబరాన్ని అంటాయ, మధ్యప్రదేశ్లో ఉప ఏన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్దకం అన్నారు, గుజరాత్లో పాలకపక్షం ప్రతికూలం అన్నారు. మరోవంక బీజేపీకి కర్నాటక, ఉత్తరప్రదేశ్ మరియ మణిపూర్లలో కరోన కాటు తప్పదన్నారు. కాని ఫలితాలు అందరి అంచనాలు తలకిందులు చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు అయన ఓటు అనే ఆయధం చాల పదునైనదని ఈ ఏన్నికల్లో నిరూపితమైయ్యంది.

  కోవిద్19 కరోన వైరస్ వల్ల దేశంలో అతి ఏక్కువ మంది లక్షలాది వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక కష్టనష్టలతో బీహర్లోని వారి స్వస్థలాలకు చేరుకున్నారు, ఇంకా అనేక మంది వలసకార్మికులు అక్కడే ఉండి వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి కష్టాలను రాహూల్ గాంధి నేతృత్వంలోని కాంగ్రేస్ పార్టీ రాజకీయ ప్రచారం కోసం వాడుకోవాలని చూసింది, కాని ఇన్ని కష్టాలు అనుభవించిన వలసకార్మికులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హృదయ స్పందన ఆత్మనిర్భర భారత్ స్పూర్తిలోని స్వచ్చత కనబడింది అనడంలో అతిశయోక్తి కాదు, లక్షలాది వలస కార్మికులను శ్రామిక రైల్లు ద్వార సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చారు. ఇంత పెద్ద ఏత్తున అనుకోకుండ వచ్చిపడిన ఉపద్రవ సమయంలో వలసకార్మికులు ఇబ్బందులు పడినప్పటికి పరిమితమైన వనరుల వినియోగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి దృడనిశ్చయంని వారు గుర్తించారు. అలాగే కాంగ్రేస్ లాంటి ప్రతిపక్ష పార్టీలు వలసకార్మికులను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయతినాలకు పరిముతమైతే, స్వస్థలాలకు వచ్చిన వలసకార్మికులకు ఉపాధిహమీ పనుల కల్పన కోసం 50 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ కి అదనంగా కేటాయంచి, దేశంలో ఎక్కువ భాగం బీహర్ వలసకార్మికుల కోసం నరేంద్ర మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వినయోగించిన వాస్తవాన్ని అర్ధం చేసుకున్నారు.

  అందుకే వలసకార్మికులు ఆత్మనిర్భర బీహర్ కోసం మద్దతు ఇచ్చారు. బీహర్ గ్రామీణప్రాంతంలో వ్యవసాయదారులు నరేంద్ర మోడి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు తమ జీవితాలలో వెలుగు నింపుతుందని భావించారు, దేశంలోని మిగత రాష్ట్రాల ఉప ఏన్నికల పై కూడా ఈ చట్టాల ప్రభావం ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 15 సంవత్సరాల పాలన అనంతరం సహజంగా ఉండే వ్యతిరేకత ఉన్నప్పటికి మద్యపాన నిషేదం బీహర్ మహిళలలో మద్దతు పెరగడం వల్ల 5 శాతం అదనపు మహిళ ఓటర్లను ఏన్డీఏ వైపు నిలిపిందని అంచనా. ఏన్డీఏ కూటమి సాధించిన 125 స్థానాలలో లో అత్యదికంగా 74 స్థానాలు బీజేపీ సాధించినప్పటికి, స్పూర్తిదాయకంగా నితీష్ కుమార్ ని భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఏన్నికల ముందు ప్రకటించిన విధంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడడం ద్వార విశ్వాస మిత్రత్వనికి సూచికగా చెప్పవచ్చు.

  తెలంగాణలోని దుబ్బాక విజయం చిరస్మరణీయం, లక్ష ఓట్ల ఆధిక్యం అన్న అహంకార ఘీంకారాన్ని ప్రజాస్వామ్యం చిత్తు చేసింది. ఏ గొంతు అసెంబ్లీలో వినపడకూడదని చేసిన కుట్రలు, వత్తిడులు, అడ్డంకులు, ఒడిదుడుకులను దాటుకొని రఘనందనరావు గొంతు అసెంబ్లీలో వినబడబోతుంది. నాలుగు పార్లమెంట్ సభ్యుల గెలుపును కొనసాగిస్తూ దుబ్బాక విజయం తెలంగాణలో భవిష్యత్ నూతన రాజకీయ ముఖచిత్రానికి శ్రీకారం చుట్టిందనడంలో సందేహం లేదు. ఉప ఏన్నికలలో మధ్యప్రదేశ్ నుండి 19 శాసనసభ స్థానాలు విజయం సాధించాక అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరత సాధించడమే కాకుండా జ్యోతిదరాధిత్య సింధియా తన పట్టు నిరూపించుకున్నారు. మణిపూర్ విజయం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్థిరపాలనకు మార్గం సుగమం చేసింది. కర్నాటక మరియ ఉత్తరప్రదేశ్ ఉప ఏన్నికల విజయం బీజేపీ పై ప్రజలకు చెక్కుచెదరని అభిమానం దర్శనమిస్తూంది.

  ఉత్తర, దక్షిణ, పశ్చిమ మరియు ఈశాన్య భారతదేశంలో జరిగిన ఈ ఏన్నికలు మిని ఏన్నికల మహాభారత సంగ్రామంగా వర్ణించవచ్చు. 2019 లోక్ సభ ఎన్నికల అనంతరం మరియ కోవిడ్19 కరోన వైరస్ లాక్డౌన్ ప్రతికూల ప్రభావం ఉన్న సమయంలో, వ్యవసాయ చట్టాల పై దుష్ప్రచారాల నేపధ్యంలో జరిగిన ఈ ఎన్నికల విజయం అనేక మంది నరేంద్ర మోదీపై, బీజేపీ పై ప్రతికూల విశ్లేషణలకు సమాధానం అని చెప్పవచ్చు. ఇదే స్పూర్తితో రాబోయే ఏన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో విజయం, తమిళనాడు, పాండిచ్చెరి మరియ కేరళ రాష్ట్రాలలో గణణీయమైన ఓటు బ్యాంక్ సాధించే దిశగా అడుగులు వేయడం తథ్యం.

  లంకా దినకర్
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Bjp, Dubbaka By Elections 2020

  తదుపరి వార్తలు