JNU వీసీ పదవి నుంచి ఆయన్ను తొలగించాలి.. ఎంఎం జోషి డిమాండ్

1998 నుంచి 2004 వరకు ఎంఎం జోషి మానవ వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. జేఎన్‌యూ వీసీ వ్యవహరిస్తున్న తీరును ఒక మాజీ HRD మంత్రిగా ఎంఎం జోషి తీవ్రంగా తప్పుబట్టారు.

news18-telugu
Updated: January 9, 2020, 10:24 PM IST
JNU వీసీ పదవి నుంచి ఆయన్ను తొలగించాలి.. ఎంఎం జోషి డిమాండ్
మురళీ మనోహర్ జోషి
  • Share this:
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నెలకొన్న పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా స్పందించారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపును ఆయన తప్పుబట్టారు. కేంద్ర మానవవనరుల శాఖ ప్రతిపాదనలు అమలు చేయకుండా వీసీ మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. JNU వీసీ పదవికి జగదీష్ కుమార్ అనర్హుడన్న ఎంఎం జోషి.. ఆయన్ను వెంటనే వీసీ పదవి నుంచి తొలగించాని డిమాండ్ చేశారు.

ఫీజుల పెంపు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండు సార్లు వీసీకి సలహాలు, సూచనలు చేసింది. కానీ ప్రభుత్వ ప్రతిపాదనలను అమలు చేయకుండా వీసీ మొండిగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన వైఖరి గర్హనీయమైనది. ఇలాంటి వ్యక్తిని వైస్ చాన్స్‌లర్ పదవిలో కొనసాగించకూడదని నా అభిప్రాయం.
ఎంఎం జోషి

మురళీ మనోహర్ జోషి గతంలో వాజ్‌పేయీ హయంలో మానవవనరులశాఖ మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. జేఎన్‌యూ వీసీ వ్యవహరిస్తున్న తీరును ఒక మాజీ HRD మంత్రిగా ఎంఎం జోషి తీవ్రంగా తప్పుబట్టారు
.

జేఎన్‌యూలో ఫీజుల పెంపు వ్యవహారంపై విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. గురువారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. ఫీజుల పెంపుతో పాటు జనవరి 5న జేఎన్‌యూలో జరిగిన హింసకు బాధ్యుడిని చేస్తూ.. జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌ జగదీష్ కుమార్‌ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు