బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేస్తామని ప్రకటించింది. సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ తమ మేనిఫెస్టోని ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో దాన్ని అందరికీ తెలియజేస్తోంది. ముఖ్యంగా పేదవారికి సంవత్సరానికి రూ.72000 ఇచ్చే కనీస ఆదాయ పథకం (న్యాయ్)ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో బీజేపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ కోసం ముందుకొచ్చింది. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్లు జైట్లీ తెలిపారు. మరోసారి మోదీ నినాదంతో మత ప్రచారం సాగుతోందన్న జైట్లీ... పని చేసే ప్రభుత్వం తమ రెండో నినాదంగా ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజల కోసం ఏమీ లేదనీ... పేదవాళ్లను ఆదుకుంటామని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని మండిపడిన మోదీ... కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో రూపొందించిన తమ మేనిఫెస్టో అన్ని వర్గాల్నీ ఆకట్టుకుంటుందని జైట్లీ వివరించారు.
బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనలో సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివరాజ్ సింగ్ చౌహాన్ పాలుపంచుకున్నారు.
ఏప్రిల్ 11న లోక్ సభ ఎన్నికల తొలిదశ మొదలుకాబోతోంది. అంటే ప్రచారానికి ఇంకా రెండ్రోజులే సమయం ఉంది. ఇంత ఆలస్యంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఆలస్యమైనా చక్కటి ప్రణాళికతో రూపొందించినట్లు కేంద్రం సమర్థించుకుంది.
ఇవి కూడా చదవండి :
పసుపు-కుంకుమ నిధులకు బ్యాంకుల బ్రేకులు... ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పాల్సిందేనా...
భద్రాచలం మాదే... మేమే అభివృద్ధి చేస్తాం : చంద్రబాబు సంచలన ప్రకటన
వైసీపీ వస్తే రాజధాని అమరావతి కాదా... రాజధానిని తరలిస్తారా... నారా లోకేష్ మాటల్లో నిజమెంత...
17 యువతిపై కన్నేశాడు... టెన్త్ ఎగ్జామ్స్ రాసి వస్తుండగా కిడ్నాప్ చేసి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Manifesto, Narendra modi