హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BJP Election Strategy 2019: మారిన బీజేపీ ఎన్నికల నినాదం ? పాటలు సిద్ధమవుతున్నాయా ?

BJP Election Strategy 2019: మారిన బీజేపీ ఎన్నికల నినాదం ? పాటలు సిద్ధమవుతున్నాయా ?

అమిత్ షా, నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)

అమిత్ షా, నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)

BJP Election strategy 2019 | ఐదేళ్లలో తాము చేసిన ప్రగతి ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని భావించిన బీజేపీ... పుల్వామా ఉగ్రదాడి, ఉగ్రస్థావరాలపై వైమానిక దళాల మెరుపుదాడి తరువాత ప్లాన్ మార్చినట్టు ప్రచారం జరుగుతోంది.

  మరోసారి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ... ఈ సారి ఎలాంటి నినాదంతో ప్రజల ముందుకు వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో ‘అబ్ కి బార్ మోదీ సర్కార్’ అంటూ బీజేపీ ఎత్తుకున్న నినాదానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడంతో పాటు అభివృద్ధి నినాదం అందుకున్న బీజేపీకి దేశప్రజలు సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారు. ఐదేళ్ల తరువాత మరోసారి ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్న బీజేపీ... తాజాగా తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.

  ఐదేళ్లలో తాము చేసిన ప్రగతి ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని భావించిన బీజేపీ... పుల్వామా ఉగ్రదాడి, ఉగ్రస్థావరాలపై వైమానిక దళాల మెరుపుదాడి తరువాత ప్లాన్ మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. జాతీయవాదం, దేశభద్రత నినాదాలతోనే ఈ సారి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు తరువాత పలు బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ... ఎక్కువ దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరుకు సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు.

  దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని మోదీ, అమిత్ షా పదే పదే చెబుతుండటంతో ఇదే బీజేపీ ఎన్నికల నినాదమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇందుకు అనుగూణంగానే ప్రముఖ రచయిత ప్రసూన్ జోషి పలు గీతాలను కూడా రచిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అభివృద్ధి నినాదంతోనే ఎన్నికలకు వెళ్లాలని భావించిన బీజేపీ... సరికొత్త నినాదంతో దేశప్రజల దృష్టిని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Amit Shah, Bjp, Lok Sabha Election 2019, Pm modi, Pulwama Terror Attack, Surgicalstrike2

  ఉత్తమ కథలు