BJP TO CELEBRATE PM NARENDRA MODI 71ST BIRTHDAY IN A BIG WAY THIS TIME AK
PM Narendra Birthday: 71 వేల దీపాలు... 14 కోట్ల రేషన్ బ్యాగుల పంపిణీ.. ఘనంగా ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు
ఫ్రధాని నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)
PM Modi: ఈసారి ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, నదీలను శుభ్రం చేసే కార్యక్రమాలు, రేషన్ కార్డుల పంపిణీతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుంది.
ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారణాసిలోని భారత్ మాతా ఆలయం దగ్గర 71 వేల దీపాలు వెలిగించబోతున్నారు. ఈ దీపాలను వెలిగించడంతో పాటు 14 కోట్ల రేషన్ బ్యాగ్‌లను పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. ఆ బ్యాగ్‌లపై థ్యాంక్యూ మోదీజీ అని ముద్రించారు. వీటితో పాటు ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) ఫోటోతో కూడిన ఐదు కోట్ల పోస్టుకార్డులను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టు ఆఫీసులను నుంచి పంపించనున్నారు. ఈసారి ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలనిబీజేపీ (BJP) నిర్ణయించింది. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, నదీలను శుభ్రం చేసే కార్యక్రమాలు, రేషన్ కార్డుల పంపిణీతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుంది. రేపటి (సెప్టెంబర్ 17) నుంచి మొదలుకాబోయే ఈ కార్యక్రమాలను 20 రోజుల పాటు నిర్వహించనున్నారు. సేవా ఔర్ సమర్పణ్ అభియాన్ ('Seva aur Samarpan Abhiyan) పేరుతో బీజేపీ ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ మెగా కార్యక్రమం అక్టోబర్ 7వ తేదీతో ముగిస్తుంది.
మరోవైపు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని 27 వేల బూత్‌లలో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి నాయకుడిగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన ఓ మంచి వక్త. ఆయన ప్రసంగాలు శక్తవంతంగా ఉంటాయి. యువతకు స్పూర్తిని ఇచ్చే విధంగా ఉంటాయి. తనదైన ప్రసంగాలతో జనాన్ని ఉత్తేజపరిచే నాయకుడు ప్రధాని మోదీ. సాధారణ ప్రజలకు కూడా ప్రధాని ప్రసంగాలు తొందరగా అర్థమవుతాయి. వారిని వారి లక్ష్యం వైపు పయనించేలా చేస్తాయి. నాయకుడిగా ఆయన అనేక ప్రసంగాలు చేశారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి.
గణితశాస్త్రం అంటే కేవలం పిల్లలు గణితంలోని లెక్కలను పరిష్కరించడం మాత్రమే కాదని.. అది ఒక ఆలోచన విధానం.
తల్లిదండ్రులు సామాజిక హోదా కోసం తన పిల్లలు లక్ష్యాలను చేరుకోవాలని కోరుకోవద్దని ఆయన చెప్పారు. ప్రతి పిల్లాడికి ప్రత్యేక టాలెంట్ ఉంటుంది.
కష్టపడితే అలసట రాదని.. దాని ద్వారా సంతృప్తి వస్తుంది.
పరిశుభ్రత విషయంలో మహాత్మగాంధీ ఎప్పుడూ రాజీపడలేదు. ఆయన మనకు స్వాతంత్ర్యం అందించారు. ఆయన కోసం మన స్వచ్ఛ భారత్‌ను ఇవ్వాలి.
మీ ముందు ఓ పేద వ్యక్తి కుమారుడు నిలబడి ఉన్నాడు. ఇదే ప్రజాస్వామ్యం యొక్క బలం.
125 కోట్ల మంది కలిసి పని చేస్తే.. దేశం 125 కోట్ల అడుగుల ముందుకు వెళుతుంది.
మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ దానిలో సమృద్ధి సాధించాలంటే మానసికంగా, శారీరంగా ధృడంగా ఉండటం ఎంతో ముఖ్యం. ధృడంగా ఉండేవాళ్లు ఆకాశాన్ని కూడా అందుకోగలరు. శరీరం ఫిట్‌గా ఉండే మైండ్ హిట్
ఇది ఓ వ్యక్తి కోసం కాదు. ఇది ఒక దేశం కోసం.
దేశంలో యువత కేవలం కొత్త ఓటర్లు కాదు. కొత్త యుగం శక్తి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.