Home /News /national /

BJP SERVES SHOW CAUSE NOTICE TO MP ANANTKUMAR HEGDE FOR COMMENTS AGAINST MAHATMA GANDHI SAYS KARNATAKA PARTY CHIEF BA

బీజేపీ ఎంపీపై ప్రధాని మోదీ ఆగ్రహం.. భేటీలకు నో ఎంట్రీ...?

ప్రధాని మోదీ (Image: DDNews)

ప్రధాని మోదీ (Image: DDNews)

‘సత్యాగ్రహం, ఆమరణ దీక్ష వల్లే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఈ కాంగ్రెస్ వాళ్లు చెబుతారు. కానీ, అది తప్పు. గాంధీ చేసిన సత్యాగ్రహం వల్ల బ్రిటిషర్లు ఇండియా వదిలి వెళ్లలేదు.’ అని అనంతకుమార్ హెగ్డే అన్నారు.

    జాతిపిత మహాత్మాగాంధీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేకు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నలీమ్ కుమార్ కటీల్ తెలిపారు. అనంతకుమార్ హెగ్డేకు నోటీసులు జారీ చేశామని, ఆయన నుంచి వివరణ కోరినట్టు కటీల్ చెప్పారు. కర్ణాటకలో అధికార పార్టీ అయిన అనంతకుమార్ హెగ్డే మహాత్మాగాంధీ మీదచేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకున పడేశాయి. దీంతో ఆ బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యల మీద ప్రధాని మోదీని కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు హెగ్డేను పార్లమెంటరీ పార్టీ భేటీకి రానివ్వవద్దని ఆదేశించినట్టు తెలిసింది.

    'A Daylight Rape of Hindus': Union Minister Ananth Kumar Hegde's Latest Shocker on Sabarimala Row
    అనంత్‌కుమార్ హెగ్డే (ఫైల్ ఫొటో)


    కర్ణాటక నుంచి ఆరుసార్లు గెలిచిన అనంతకుమార్ హెగ్డే జాతిపిత మహాత్మాగాంధీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ స్వతంత్ర్య సంగ్రామం అంతా బ్రిటిష్ వారి మద్దతుతోనే చేశారని ఆరోపించారు. ‘గాంధీ స్వాతంత్ర్య పోరాటం ఓ డ్రామా. వారిలో ఒక్కరిని కూడా బ్రిటిష్ పోలీసులు లాఠీతో కొట్టలేదు.’ అని కామెంట్స్ చేశారు. దీంతోపాటు మహాత్మాగాంధీ చేసిన సత్యాగ్రహాన్ని కూడా హెగ్డే ‘డ్రామా’గా అభివర్ణించారు. ‘సత్యాగ్రహం, ఆమరణ దీక్ష వల్లే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఈ కాంగ్రెస్ వాళ్లు చెబుతారు. కానీ, అది తప్పు. గాంధీ చేసిన సత్యాగ్రహం వల్ల బ్రిటిషర్లు ఇండియా వదిలి వెళ్లలేదు.’ అని అనంతకుమార్ హెగ్డే అన్నారు.

    మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి (File)


    హెగ్డే చేసిన వ్యాఖ్యల మీద కర్ణాటక బీజేపీ నేతలు కొంచెం ఆచితూచి స్పందిస్తున్నారు. హెగ్డే వ్యాఖ్యలను తాము సమర్ధించబోమని చెబుతున్నారు. మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ చాలా గొప్పగా చూస్తుందని, హెగ్డే చేసిన చీప్ మాటలను ఎవరూ సమర్థించబోమని బీజేపీ అధికార ప్రతినిధి జి.మధుసూదన్ తెలిపారు. హెగ్డే చేసిన వ్యాఖ్యలను ఖండించిన మరో నేత హెగ్డే మీద పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉందని చెప్పారు. ‘ఆయన చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని చెప్పాం. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యలను ఒప్పుకోం.’ అని ఓ బీజేపీ నేత చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ananth Kumar, Mahatma Gandhi, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు