Bandaru Dattatreya : హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.
హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారోత్సవంలో హిమాచల్ ప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా దత్తాత్రేయ టోపీని ధరించారు.
మంగళవారమే ఆయన కుటుంబ సమేతంగా సిమ్లాకు బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయనను గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్ ఐపీఎస్ ఏడీసీ మోహిత్ చావ్లా దత్తాత్రేయ నివాసానికి వచ్చి అందజేసి, ఘనంగా సన్మానించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.