కొత్త మిత్రులు కావలెను...బీజేపీ అన్వేషణ

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త మిత్రులను అన్వేషించే ప్రయత్నాలను కమలనాథులు ముమ్మరం చేశారు. మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాల తరువాత మిత్రపక్షాల పట్ల బీజేపీ వ్యవహరించే తీరులో మార్పు కనిపిస్తోంది.

news18-telugu
Updated: December 27, 2018, 1:42 PM IST
కొత్త మిత్రులు కావలెను...బీజేపీ అన్వేషణ
బీజేపీ నేత రాంమాధవ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో... ఎన్డీయేలోకి కొత్త మిత్రులను తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త మిత్రులను అన్వేషించే ప్రయత్నాలను కమలనాథులు ముమ్మరం చేశారు. మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాల తరువాత మిత్రపక్షాల పట్ల బీజేపీ వ్యవహరించే తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీయే నుంచి అనేక పార్టీలు దూరమవడంతో... కొత్తవారికి తమ వైపుకు తిప్పుకోవడం ఎలా అనే దానిపై కాషాయదళం ఫోకస్ పెట్టింది.

BJP searching for new party to join NDA, implementing new plan కొత్త మిత్రులు కావలెను...బీజేపీ నయా ప్లాన్ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త మిత్రులను అన్వేషించే ప్రయత్నాలను కమలనాథులు ముమ్మరం చేశారు. మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాల తరువాత మిత్రపక్షాల పట్ల బీజేపీ వ్యవహరించే తీరులో మార్పు కనిపిస్తోంది.
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా (ఫైల్ ఫోటో)


ప్రస్తుతం తమతో ఉన్న మిత్రులను కోల్పోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిన బీజేపీ... ఇందుకోసం కొంత వెనక్కి తగ్గేందుకు కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా బీహార్‌లో తమ పార్టీకి చెందిన ఐదు సిట్టింగ్ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు అంగీకరించింది. దశాబ్దాల పాటు బీజేపీతో కలిసున్న శివసేన... మళ్లీ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు నిరాకరిస్తోంది. ఏపీలో టీడీపీ బీజేపీకి దూరమైంది. ఇలా చాలా రాష్ట్రాల్లో ఉన్న మిత్రులు బీజేపీకి దూరమవడం... కొత్త మిత్రుల చేరిక లేకపోవడంతో ఎన్డీయేలోకి కొత్తగా వచ్చేవారెవరు అనే అంశంపై సందేహాలు నెలకొన్నాయి.

BJP searching for new party to join NDA, implementing new plan కొత్త మిత్రులు కావలెను...బీజేపీ నయా ప్లాన్ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త మిత్రులను అన్వేషించే ప్రయత్నాలను కమలనాథులు ముమ్మరం చేశారు. మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాల తరువాత మిత్రపక్షాల పట్ల బీజేపీ వ్యవహరించే తీరులో మార్పు కనిపిస్తోంది.
శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే, టీడీపీ చీఫ్ చంద్రబాబు


మోదీ, అమిత్ షా ద్వయం నాలుగేళ్ల పాటు వ్యవహరించిన తీరు కారణంగా... వారితో కలిసి పని చేసేందుకు ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో వారిని తమవైపు తిప్పుకోవడం బీజేపీకి కష్టసాధ్యంగా మారింది. మరోవైపు బీజేపీతో జట్టుకట్టేందుకు మిత్రపక్షాలు అధికంగా సీట్లు కోరుతుండటంతో... ఇందుకోసం ప్లాన్-బిని అమలు చేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత రాంమాధవ్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి రాజకీయాలకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.

అయితే కొత్తగా ఎన్డీయేలోకి ఏయే పార్టీలు వచ్చి చేరతాయనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. అయితే కొత్త మిత్రులు దక్షిణ, ఈశాన్య భారతం నుంచి ఉంటాయని రాంమాధవ్ సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల ముందు ఇలాంటివన్నీ సహజమని, కొత్తేమీ కాదని చెప్పుకొచ్చారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ప్లాన్-బికి తెరలేపిన బీజేపీ... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు ధీటుగా మిత్రులను సంపాదించుకుంటుందేమో చూడాలి.
Published by: Kishore Akkaladevi
First published: December 27, 2018, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading