Home /News /national /

BJP SEALS ALLIANCE WITH AMARINDAR SINGH PARTY AND SAD SAMYUKT PARTY IN PUNJAB ASSEMBLY ELECTIONS 2022 AK

పంజాబ్‌లో బీజేపీ సీట్ల పంపకం ఫిక్స్.. ఆ రెండు పార్టీలతో పొత్తు.. కాంగ్రెస్ మాజీ సీఎంతో కలిసి..

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

Bjp seals alliance with amarindar singh party and sad samyukt party in Punjab assembly elections 2022 ak పంజాబ్‌లో బీజేపీ సీట్ల పంపకం ఫిక్స్.. ఆ రెండు పార్టీలతో పొత్తు.. కాంగ్రెస్ మాజీ సీఎంతో కలిసి..

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ పొత్తులను ఖరారు చేసింది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్, SAD సంయుక్త్‌లతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సీట్ల పంపకాలను కూడా ఖరారు చేసుకుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో బీజేపీ 65 స్థానాల్లో, అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37, ఎస్‌ఏడీ-సంయుక్త్ 15 స్థానాల్లో పోటీ చేస్తాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. పంజాబ్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరమని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో భద్రత చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉందని అన్నారు. ఈ ఎన్నికలు సుస్థిరత, భద్రత కోసమే అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడమే మా నినాదమని జేపీ నడ్డా తెలిపారు. 1984 అల్లర్లపై విచారణకు ప్రధాని నరేంద్ర మోదీ సిట్‌ను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. అప్పటి నిందితులు ఇప్పుడు జైళ్లలో ఉన్నారని చెప్పారు.

    పంజాబ్‌లో మాఫియా రాజ్‌ను రద్దు చేస్తామని జేపీ నడ్డా అన్నారు. ఫిబ్రవరి 20న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 22 నియోజకవర్గాల అభ్యర్థుల తొలి జాబితాను అమరీందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ నకోదర్ నుంచి బరిలోకి దిగారు. ప్రాంతాలు, సమాజంలోని వివిధ వర్గాలలో తగిన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తున్నామని.. గెలుపుపై స్పష్టమైన దృష్టితో అభ్యర్థులను రంగంలోకి దించామని అమరీందర్ సింగ్ అన్నారు. ఆయన తన సొంత స్థానమైన పాటియాలా అర్బన్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

    ఇదిలా ఉంటే రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు కేంద్రమైన పంజాబ్‌లో బీజేపీకి అంతగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని సర్వేలు అంచనా వేశాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఫలితాలు వన్‌సైడ్‌గా వచ్చే అవకాశాలు లేవని సర్వేలు పేర్కొన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు.. ఎన్నికల్లో ఆ పార్టీపై ఏ మేరకు ఫలితాలు చూపుతాయనే టెన్షన్ కాంగ్రెస్ హైకమాండ్‌లో నెలకొంది. ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న సిద్ధూ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో కలిసి ఎంతవరకు విజయానికి కృషి చేస్తారన్నది సందేహమే.

    WhatsApp, Telegram, Zoom, Google Meet వాడొద్దు.. మోదీ సర్కార్ సంచలన ఆదేశాలు

    Subhash Chandra Bose: ఐసీఎస్‌కు రాజీనామా లేఖ‌లో నేతాజీ ఏం రాశారు.. ట్రెండింగ్‌గా రాజీనామా లేఖ‌!

    మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఆప్‌ నుంచి పెద్ద ముప్పు పొంచి ఉందని సర్వేలు అంచనా వేశాయి. ఆప్ తరపున పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్‌ను ఎంపిక చేశారు. పంజాబ్‌లో తమ పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని బలంగా నమ్ముతున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... ఈ రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడ బీజేపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే ఫోకస్ చేస్తున్నారు. పరిస్థితులను బట్టి కింగ్ లేదా కింగ్ మేకర్ పాత్రను తాము పంజాబ్‌లో పోషించడానికి అవకాశం ఉంటుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు