• Home
 • »
 • News
 • »
 • national
 • »
 • BJP PRESIDENT JP NADDA COUNTERS ON SONIA GANDHIS ARTICLE IN HT AND RAHULS VIOLENT HATRED FOR PM NARENDRA MODI NK

JP Nadda Counter: మీ విమర్శలే మోదీకి ప్రశంసలు. రాహుల్, సోనియాకు జేపీ నడ్డా కౌంటర్

రాహుల్, సోనియాకు జేపీ నడ్డా కౌంటర్ (File)

JP Nadda Counter: పాలక పక్షంపై రోజుకో రకంగా విరుచుకుపడుతున్న రాహుల్ గాంధీపై తనదైన శైలిలో ఘాటు కౌంటర్లు ఇచ్చారు జేపీ నడ్డా. రాహుల్ తాజాగా చేసిన ఆరోపణలేంటి?

 • Share this:
  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (J P Nadda) జనరల్‌గా ప్రతిపక్షాల విమర్శలకు స్పందించరు. ఎప్పుడో గానీ ఆయన కౌంటర్లు వెయ్యరు. అలాంటి ఓ సందర్భం ఇప్పుడొచ్చింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్ చేస్తూ ఆయన ఘాటైన విమర్శలు ట్విట్టర్ ద్వారా చేశారు. వరుస ట్వీట్లలో విమర్శాస్త్రాలు సంధించారు. "నిరాశ, సిగ్గులేనితనం ఈ రెండింటి కలయిక ప్రమాదకరం. కాంగ్రెస్‌లో ఈ రెండూ ఉన్నాయి. తల్లి సారధ్యంలో ఆ పార్టీలో మర్యాద, ప్రజాస్వామ్యం లోపించాయి. కొడుకేమో అసహనం, ఆగ్రహం, అబద్ధాలు, ఆవేసంతో రెచ్చిపోతున్నాడు. ద్వంద్వ ప్రమాణాలు" అని ఓ ట్వీట్‌లో విమర్శించారు.


  "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను పంజాబ్‌లో తగలబెట్టడం అన్నది రాహుల్ గాంధీ ఆడించిన సిగ్గుమాలిన డ్రామా. అది అనూహ్యమైనది కాదు. అసలు నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ... ఏనాడూ ప్రధానమంత్రి కార్యాలయాన్ని గౌరవించింది లేదు. 2004-2014లో ప్రధానమంత్రి పదవి ఎంత బలహీనం అయిపోయిందా మనం చూశాం" అని మరో ట్వీట్‌లో విమర్శించారు నడ్డా.


  "మోసపూరితంగా వ్యవహరించిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్సే. రాజస్థాన్‌లో ఎస్సీ/ఎస్టీ వర్గాల వారిపై అరాచకాలు... ఎప్పుడూ లేనంత ఎక్కువగా జరుగుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్‌లో మహిళలకు రక్షణ లేదు. పంజాబ్ మంత్రులైతే... స్కాలర్‌ఫిప్స్ స్కాములకు పాల్పడ్డారు" అని మరో ట్వీట్‌లో ఉతికారేశారు నడ్డా.


  "కాంగ్రెస్‌లో స్వేచ్ఛగా మాట్లాడే ఛాన్స్ ఉండదు. దశాబ్దాలుగా అసమ్మతి వాదుల గళాలను అణచివేస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఆ దారుణాలను మనం చూశాం. రాజీవ్ గాంధీ హయాంలో ప్రెస్ ఫ్రీడమ్‌ను బలహీనపరచాలని చూశారు. స్వేచ్ఛ ఉన్న ప్రెస్... కాంగ్రెస్‌ను కుదిపేసింది. మహారాష్ట్రలో ఏమైంది... రాష్ట్ర అధికారాలను అణచేశారు. ప్రత్యర్థులకు సమస్యలు తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను అణచివశారు. పాలన తప్ప మిగతా అరాచకాలన్నీ చేశారు. పేదరికంలో పుట్టి... ప్రధాని అయ్యి... చరిత్ర తిరగరాసిన వ్యక్తిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. దేశ ప్రజలు మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రేమానురాగాల్ని చూపిస్తున్నారు. కాంగ్రెస్ ఎంతగా అబద్ధాలు చెప్పి, విద్వేషాల్ని రగిలిస్తే... అంతగా ప్రధానమంత్రికి మేలు జరుగుతుంది" అని నడ్డా తన ట్వీట్ల దాడి చేశారు.


  పంజాబ్‌లో ఈ మధ్య జరిగిన ఓ అత్యాచార ఘటన సందర్భంగా జేపీ నడ్డా ఈ కౌంటర్లు వేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో... హత్రాస్ అత్యాచార ఘటనపై విమర్శలు చేసిన కాంగ్రెస్... పంజాబ్ ఘటనపై ఎందుకు మాట్లాడట్లేదని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజేపీ ప్రభుత్వం లాగా పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో జరిగే అత్యాచార ఘటనలను దాచట్లేదని, బాధితరాలి కుటుంబాన్ని బెదిరించి, వారికి న్యాయం అందకుండా అడ్డుపడడం లేదని రాహుల్... తాజా విమర్శలను తిప్పికొట్టారు.

  పంజాబ్‌లో దారుణం: పంజాబ్‌లో ఆరు సంవత్సరాల చిన్నారిపై తాత, మనవళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి, హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. దీనిపై కేసు రాసిన పోలీసులు... నిందితులైన గుర్ ప్రీత్ సింగ్, అతని తాత సర్జిత్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని నిందితుల ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
  Published by:Krishna Kumar N
  First published: