
కుమారస్వామి (File)
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చేందుకు బీజేపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు ఆకర్షించడానికి భారీ మొత్తంలో ముడుపులు ఆశ చూపుతున్నారని..మన ప్రజాస్వామ్యంలో ఇలాంటి అప్రజాస్వామిక పనులకు పాల్పడుతున్న బీజేపీ పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలను ఉంచేందుకు కొన్ని రిసార్టులను సిద్ధం చేసినట్టు మీడియాలో పలుకథనాలు వస్తున్నాయి. మేం ఎలాంటి సవాలునైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కుమారస్వామి తెలిపారు.
Published by:Vijay Bhaskar Harijana
First published:September 15, 2018, 02:01 IST