ఉత్తరాఖండ్ కేబినెట్ (Cabinet) మంత్రి హరక్ సింగ్ రావత్ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ (Uttara Khand) లో బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినందున, పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు సమాచారం. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ అంశపై కథనాలు రాస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ బీజేపీ (BJP) ప్రభుత్వం హరక్ సింగ్ రావత్ అటవీ, పర్యావరణం, కార్మిక మరియు ఉపాధి శాఖలను నిర్వహిస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశఃలో రావత్ తన నియోజకవర్గం కోట్ద్వార్లో వైద్య కళాశాల (Medical College) పై స్పందించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారని సమాచారం. అక్కడి నుంచి అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయారు. అంతే కాకుండా రాజీనామా చేస్తానని అధిష్ఠానాన్ని బెదిరిస్తున్నట్టు సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (BJP State President) మదన్ కౌశిక్ ఈ అంశంపై మాట్లాడారు. మంత్రి రావత్ ఆయన ప్రాంతంలో మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. రాజీనామా చేయలేదని అన్నారు. “ఏమీ జరగలేదు, రాజీనామా లేదు.
Corona Cases: ఈ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు.. టీకాలు, కోవిడ్ పరీక్షల పరిశీలన
కోట్ద్వార్లో మెడికల్ కాలేజీ నిర్మాణంపై తన కోపాన్ని మాత్రమే చూపించాడు, కానీ రాజీనామా చేయలేదు” అని కౌశిక్ అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అంతా బాగానే ఉందని పేర్కొన్నారు.
రావత్ 2017లో కాంగ్రెస్ (Congress) నుంచి బీజేపీలో చేరి కోట్ద్వార్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా రావత్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రావత్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో గర్వాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకుముందు, అతను 1990లలో ఉత్తరప్రదేశ్లోని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉత్తరాఖండ్లో ధామీని ఇన్చార్జ్గా ఉంచడానికి ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్ రావత్, తిరత్ సింగ్ రావత్లను మార్చిన బిజెపికి ఈ పరిణామం తాజా తలనొప్పిగా మారింది.
Crime News: 18 ఏళ్ల అమ్మాయి.. అంకుల్ అని పిలిచినందుకు.. ఇంత పని చేశాడు!
త్వరలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. త్వరలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) పలు ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా అమ్మాయిల వివాహ వయసు పెంపు చట్టాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యోగీ ప్రభుత్వం తాజాగా కొత్త నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ చదవుతున్న కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు (Smart Phones), ట్యాబ్లు అందించనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 25, 2021న మాజీ ప్రధాని, భారత రత్న వాజ్పేయి జయంతి రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Medical college, Uttarakhand