సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆగ్రహం...

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీరియస్ అయ్యారు.

news18-telugu
Updated: April 28, 2020, 9:00 PM IST
సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆగ్రహం...
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP Telangana/Twitter)
  • Share this:
బీజేపీకి చెందిన ఎమ్మెల్యేపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీరియస్ అయ్యారు. ప్రజలు ఎవరూ ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దని వ్యాఖ్యానించిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఉన్న వారంతా భారతీయులేనన్న నడ్డా... ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా వ్యవహరించవద్దని పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన సురేశ్ తివారీపై చర్యలు తీసుకోవాలని ఆయన ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అంతకుమందు ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ.. ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు కొనవద్దంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశం మొత్తం కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బీజేపీ నేతలు మాత్రం ద్వేషాన్ని పెంచుకోవడంలో బిజీగా ఉన్నారని విపక్షాలు మండిపడ్డాయి. అయితే తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన తివారీ... తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను అలా అన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తిలో తబ్లిగీ జమాత్ సభ్యుల పాత్ర ఉందని చాలా మంది తనకు పిర్యాదు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వారి నుంచి కూరగాయలు కొనొద్దని ముందుజాగ్రత్త చర్యగా సూచించానని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: April 28, 2020, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading