మోదీ కార్యాలయం నుంచి ఫోన్ అందుకున్న నేతలు వీరే...? కిషన్ రెడ్డికి  పీఎంవో నుంచి ఫోన్ ...? 

పలువురు ఎంపీలకు రేపటి ప్రమాణస్వీకారానికి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఫోన్లు వస్తున్నాయి. అటు తెలంగాణ నుంచి కూడా ఈ సారి మంత్రి వర్గంలో ఒకరికి చాన్స్ దక్కనుందనే వార్తలు వస్తున్నాయి. వారిలో కిషన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.

news18-telugu
Updated: May 29, 2019, 11:02 PM IST
మోదీ కార్యాలయం నుంచి ఫోన్ అందుకున్న నేతలు వీరే...? కిషన్ రెడ్డికి  పీఎంవో నుంచి ఫోన్ ...? 
అమిత్ షా, నరేంద్ర మోదీ (ఫైల్)
  • Share this:


ప్రధాని మోదీ కార్యాలయం నుంచి రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులకు ఫోన్లు వస్తున్నాయి. వీరిలో రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌, రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్, గజేంద్ర షెకావత్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రేపు మోదీతో పాటు మొత్తం 40 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారని పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ, అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు గడిచిన 4 గంటలుగా చర్చలు కొనసాగిస్తున్నారు. మంత్రి వర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ మిత్ర పక్షాలతో పాటు కొత్తగా ఎంపికైన ఎంపీలకు సైతం కేంద్రకేబినేట్ లో చోటు కల్పించడం కోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీనియర్ నేతలైన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ అనారోగ్య కారణాల వల్ల కేబినేట్ కు దూరంగా ఉంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీ టీం ఎలా ఉండనుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇప్పటికే పలువురు ఎంపీలకు రేపటి ప్రమాణస్వీకారానికి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఫోన్లు వస్తున్నాయి. అటు తెలంగాణ నుంచి కూడా ఈ సారి మంత్రి వర్గంలో ఒకరికి చాన్స్ దక్కనుందనే వార్తలు వస్తున్నాయి. వారిలో కిషన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. మరోవైపు మోదీ కార్యాలయం నుంచి కిషన్ రెడ్డికి సైతం ఫోన్ వచ్చిందని రేపు ఆయన ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి మంత్రి వర్గంలో యువత, మహిళలకు పెద్ద పీట వేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.
Published by: Krishna Adithya
First published: May 29, 2019, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading