బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ 17వ లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 17న ప్రారంభంకానున్నాయి. తొలి రెండు రోజుల్లో ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ నియోజకవర్గం నుంచి వీరేంద్ర కుమార్ లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మునుపటి మోదీ సర్కారులో ఆయన కేంద్ర సహాయ మంత్రిగానూ వ్యవహరించారు.
లోక్‌సభ సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభంకానుండగా...స్పీకర్ ఎన్నికను 19న చేపట్టనున్నారు. 20న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Union Budget 2019