Home /News /national /

BJP MP VARUN GANDHI HAS CRITICIZED THE BJP FOR IMPOSING NIGHT CURFEW AND HOLDING ELECTION RALLIES WITH MILLIONS OF PEOPLE DURING THE DAY PRV

Uttar Pradesh: బీజేపీని ఇరుకున పెట్టిన ఆ పార్టీ ఎంపీ వరుణ్​ గాంధీ..  ఆయన చేసిన ఒక్క ట్వీట్​తో ఫుల్ డ్యామేజ్​..

వరుణ్ గాంధీ, ప్రధాని మోదీ (ఫైల్​)

వరుణ్ గాంధీ, ప్రధాని మోదీ (ఫైల్​)

ఇటీవలె రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారు ఎక్కించిన ఘటనలో బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆ డ్యామేజ్​ నుంచి బయటపడటానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఇపుడు సొంత పార్టీ ఎంపీ పెట్టిన ఓ ట్వీట్​ ఉత్తరప్రదేశ్​ బీజేపీకి మింగుడుపడటం లేదు

ఇంకా చదవండి ...
    వచ్చే ఏడాదిలో ఉత్తర‌ప్రదేశ్ ఎన్నిక‌లు (Uttar Pradesh) జరగనున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే అత్యధిక స్థానాలు కలిగిన యూపీలో పాగా వేయక తప్పని పరిస్థితి ఆయా జాతీయ పార్టీలది. ఒకవేళ యూపీలో చేజారితే ఇక కేంద్రంలో మనుగడ కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే  ఆయా పార్టీలు తమ శక్తనంతా కూడగట్టుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓవైపు ప్రియాంకా, మరోవైపు రాహుల్​ కాంగ్రెస్​ నుంచి దూకుడుగా ఉన్నారు. ఇక బీజేపీకి ప్రధాని నరేంద్రమోదీ, అమిత్​షా, సీఎం యోగీ ఆదిత్యనాథ్​ ముందుండి నడిపిస్తున్నారు. ఇటీవలె రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారు ఎక్కించిన ఘటనలో బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆ డ్యామేజ్​ నుంచి బయటపడటానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఇపుడు సొంత పార్టీ ఎంపీ పెట్టిన ఓ ట్వీట్​ ఉత్తరప్రదేశ్​ బీజేపీకి మింగుడుపడటం లేదు. ఎన్నికల వేళ ఇలాంటి ట్వీట్లు పార్టీని ఇబ్బందుల్లోకి నెడతాయని బీజేపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు.

    ఇటీవల కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్​లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచనలను జారీ చేసింది. అందులో భాగంగా పలు మార్గదర్శకాలు సూచించింది. అందుకే ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం ఒమిక్రాన్​ కట్టడిలో భాగంగా యూపీలో రాత్రి కర్ఫ్యూ అంటూ ఉత్తర్వులు ఇచ్చేసింది. అయితే ఎన్నికలు కావడంతో పగటిపూట ప్రచార పర్వం కొనసాగుతోంది. దీంతో సొంత పార్టీ ఎంపీ వ‌రుణ్‌గాంధీ (MP Varun Gandhi) వారిని విమర్శిస్తూ పోస్టు పెట్టాడు. తాజాగా  బీజేపీ (BJP)ని తూర్పార‌ప‌డుతూ వ‌రుణ్‌గాంధీ ట్వీట్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

    వరుణ్​ గాంధీ (Varun Gandhi) ట్విటర్​లో..  "రాత్రిపూట కర్ఫ్యూ (Night Curfew) విధించడం, పగలేమో ర్యాలీలకు లక్షల మందిని పిలవడం, సామాన్య ప్రజలకు ఎంతకీ అంతుపట్టడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మనమంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఒమిక్రాన్‌ వ్యాప్తిని అడ్డుకోవడమా? లేదా ఎన్నికల ప్రచార శక్తిని ప్రదర్శించడమా, ఈ రెండింటో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిజాయతీగా నిర్ణయించుకోవాలి”అని ట్విటర్‌లో రాసుకొచ్చారు . ఈ ట్వీట్‌ ప్రస్తుతం రాజకీయ రచ్చకు దారితీసింది. దీన్ని అసరాగా చేసుకొని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు రాత్రిపూట యోగీ సర్కార్ కర్ఫ్యూ విధించింది.



    అదే సమయంలో పలు కార్యక్రమాలను, సభలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వరుణ్‌గాంధీ ట్వీట్లకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. వరుణ్‌గాంధీ ట్వీట్‌ ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారిందనే చర్చ జరుగుతోంది. యూపీ నుంచే ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వ‌రుణ్‌గాంధీ, త‌న పార్టీనే టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శలు చేయడం చ‌ర్చనీయాంశ‌మ‌వుతోంది. సాగు చ‌ట్టాల‌ విషయంలోనూ వరుణ్ వైఖరి వివాదాస్పదం అయ్యింది. వరుణ్‌ విమర్శలతో బీజేపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సొంత పార్టీ, ప్రభుత్వంపై వరుణ్‌గాంధీ విమర్శల్ని సీరియస్‌గా పరిగణిస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: 5 State Elections, Bjp, Night curfew, PM Narendra Modi, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections, Viral tweet, Yogi adityanath

    తదుపరి వార్తలు