Home /News /national /

Lakhimpur : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలనం -నేరుగా PM Modiకి -ప్రియాంక గాంధీ సైతం అదే పని

Lakhimpur : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలనం -నేరుగా PM Modiకి -ప్రియాంక గాంధీ సైతం అదే పని

ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ లేఖ

ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ లేఖ

మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కూడా ఆ అంశంపై రాజకీయ వివాదాలు ఇంకా చల్లారలేదు. ప్రధాని మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పి, చట్టాలను రద్దు చేసినా, యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపై హింసాకాండ ఘటనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శనివారం నాడు ప్రధాని మోదీకి సంచలన లేఖలు రాశారు..

ఇంకా చదవండి ...
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలంటూ తీసుకొచ్చిన మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కూడా ఆ అంశంపై రాజకీయ వివాదాలు ఇంకా చల్లారలేదు. ప్రధాని మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పి, చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రైతు సంఘాల సమాఖ్య కీలక సమావేశం నిర్వహిస్తున్న తరుణంలోనే బీజేపీకి చెందిన గాంధీ కుటుంబీకుడు, కాంగ్రెస్ లోని గాంధీ వారసులు సంచలన చర్యలకు దిగారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీలు లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై శనివారం నాడు ప్రధాని మోదీకి వేర్వేరుగా లేఖలు రాశారు.

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో అక్టోబర్ 3న.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులను కారుతో గుద్దించి చంపిన ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా కేసు దర్యాప్తు సాగుతుండటం, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా స్పందించి, యూపీ సర్కారు తీరును తప్పు పడుతూ, పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రాకేశ్ మిశ్రా పర్యవేక్షణలో దర్యాప్తు జరిపిస్తుండటం తెలిసిందే. తాజా పరిణామాలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. ప్రధాని మోదీకి సంచలన లేఖ రాశారు.

మా అక్కను అంటే మెడలు విరిచేస్తా -భువనేశ్వరిపై వైసీపీ కామెంట్లకు నందమూరి బాలకృష్ణ రియాక్షన్ - ఏమన్నారంటే..


లఖీంపూర్ ఖేరీలో రైతులపై హింసాకాండ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ కేసులో నిందితులై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ లేఖ రాశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన వరుణ్ గాంధీ.. నిరసనల సమయంలో రైతులపై మోపిన అన్ని కేసులను కూడా రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. మరోవైపు,

Hyderabad : హీరోయిన్‌పై అత్యాచారం.. లైట్‌బాయ్ బాబు పన్నాగమిదే -shalu chourasiya కేసులో షాకింగ్ ట్విస్ట్


లఖీంపూర్ ఖేరీ ఘటనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రధానికి లేఖ రాసినట్లే.. ఆయన సోదరి, కాంగ్రెస్ యూపీ ఇంచార్జి ప్రియాంక గాంధీ వాద్రా కూడా శనివారం నాడు ప్రధానికి లేఖ రాశారు. రైతులకు తీరని నష్టం చేసే సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవడం మంచిదే అయినా.. ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం నిజంగా మంచిదే అయితే.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో ఎప్పటికీ వేదికలు పంచుకోరాదని ప్రియాంక డిమాండ్ చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ పలు కార్యక్రమాల నిమిత్తం యూపీలో తరచూ పర్యటిస్తోన్న నేపథ్యంలో ప్రియాంక ఈ కామెంట్లు చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Congress, Farmers Protest, Pm modi, Priyanka Gandhi, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు