ఐదేళ్లలో ఆ బీజేపీ నేత వయసు ఒక్క సంవత్సరమే పెరిగిందట..

లక్ష్మీనారాయణ యాదవ్ 2014లో పోటీ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు, అందులో తన వయసు 73 ఏళ్లు అని పేర్కొన్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 2:56 PM IST
ఐదేళ్లలో ఆ బీజేపీ నేత వయసు ఒక్క సంవత్సరమే పెరిగిందట..
లక్ష్మీనారాయణ యాదవ్ (File)
news18-telugu
Updated: March 29, 2019, 2:56 PM IST
ఎన్నికల సమయం వచ్చిందంటే రాజకీయ నేతల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అప్పటి వరకు జనం చూడని పనులు చేస్తుంటారు. వినని కామెంట్స్ చేస్తుంటారు. అయితే, ఓ బీజేపీ నేత మాత్రం ఏకంగా తన వయసును తగ్గించేశారు. ఎన్నికల్లో పోటీ కోసం నామినేషన్ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన వయసును తగ్గించారు. ఐదేళ్ల కాలంలో ఆయన వయసు ఒక్క సంవత్సరం మాత్రమే పెరిగిందని చెప్పడం కొసమెరుపు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అయిన లక్ష్మీనారాయణ యాదవ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అందులో ఆయన వయసు 74 సంవత్సరాలు అని తెలిపారు. అయితే, ఇదే లక్ష్మీనారాయణ యాదవ్ 2014లో పోటీ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు, అందులో తన వయసు 73 ఏళ్లు అని పేర్కొన్నారు. వయసు మాత్రం పేర్కొన్న ఎంపీ.. పుట్టిన తేదీ రాయలేదు.

బీజేపీలో కురువృద్ధులకు టికెట్లు ఇవ్వకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు ఈ మధ్య ప్రచారం జరిగింది. 75 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో పార్టీ సీనియర్లు అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారికి కూడా టికెట్లు దక్కలేదు. మరోవైపు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ 12న 76వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఆమెకు కూడా టికెట్ ఇంకా ఖరారు కాలేదు.

వయసు వివాదంపై లక్ష్మీనారాయణ యాదవ్‌ను న్యూస్‌18 సంప్రదించింది. 2014లో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు తాను వయసు ఎంత చెప్పానో గుర్తులేదన్నారు. తన పుట్టిన రోజు మాత్రం 1944 నవంబర్ 9 అని తెలిపారు.

First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...