‘బంగారు కోడిపెట్ట’ అంటూ ఓటర్లను ఉర్రూతలూగించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి

బంగారు కోడిపెట్ట సాంగ్

పూరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సంబిత్ పాత్రా, బీజేడీ తరఫున పినాకి మిశ్రా, కాంగ్రెస్ తరఫున సత్యప్రకాష్ నాయక్ పోటీ చేస్తున్నారు. ఈనెల 23న పోలింగ్ జరగనుంది.

 • Share this:
  ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు రకరకాల పాట్లు పడుతూ ఉంటారు. ఎన్నికల సమయంలో పిండి రుబ్బడం, ఇస్త్రీ చేయడం, పిల్లలకు స్నానాలు చేయిస్తూ ఫొటోలు తీసుకోవడం వంటి చిత్ర విచిత్రాలు చాలా జరుగుతూ ఉంటాయి. అయితే, ఈ బీజేపీ ఎంపీ అభ్యర్థి మరో అడుగు ముందుకేశారు. ఒడిశాలోని పూరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున సంబిత్ పాత్రా పోటీ చేస్తున్నారు. పూరి నియోజకవర్గంలో తెలుగువారు కూడా బాగానే ఉన్నారు. ప్రధానంగా మత్స్యకారులు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వారి ఓట్లు కూడా కీలకమే. స్థానికంగా ఎక్కువ తెలుగువారు ఉండే ప్రాంతంలో సంబిత్ పాత్రా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న తెలుగువారిని ఉత్సాహ పరచడానికి తెలుగు సినిమా పాటలు పాడారు.

  సంబిత్ పాత్రా


  నాగార్జున హీరోగా నటించిన క్రిమనల్ సినిమాలోని ‘తెలుసా మనసా’ అంటూ సంబిత్ పాత్ర డ్యూయట్ అందుకోగానే, జనం కూడా కేకలు వేస్తూ సంబరాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత మగధీరలో రీమిక్స్ చేసిన ‘బంగారు కోడిపెట్ట’ పాట పాడగానే జనం గోల గోల చేశారు. దీనికి సంబందించిన ఓ వీడియోను సంబిత్ పాత్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.  ‘పూరీలో చాలా మంది తెలుగువారు ఉన్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో వారి అడగడంతో పాటలు పాడా. ఆ పాటలకు వారి ఉత్సాహాన్ని చూడాల్సిందే. తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. నా తెలుగు ఫ్రెండ్స్ అందరికీ లవ్.’ అంటూ ట్వీట్ చేశారు. పూరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సంబిత్ పాత్రా, బీజేడీ తరఫున పినాకి మిశ్రా, కాంగ్రెస్ తరఫున సత్యప్రకాష్ నాయక్ పోటీ చేస్తున్నారు. ఈనెల 23న పోలింగ్ జరగనుంది.
  First published: