హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rahul Gandhi: సముద్ర రైతులకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదన్న రాహుల్.. ఓ ఆటాడేసుకుంటున్న బీజేపీ

Rahul Gandhi: సముద్ర రైతులకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదన్న రాహుల్.. ఓ ఆటాడేసుకుంటున్న బీజేపీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

Rahul Gandhi - Bjp: పుదుచ్చేరి వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయనకు ఇటలీలోనే చెబితే అర్థమవుతుందని.. ఏకంగా కేంద్ర మంత్రులు సైతం రాహుల్ గాంధీని ఆటాడేసుకున్నారు.

 • News18
 • Last Updated :

  Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేశారు. బీజేపీ నాయకులు రాహుల్ ను ఎందుకు ‘పప్పు’ అని అంటారో మరోసారి తన అజ్ఞాన వ్యాఖ్యలతో రుజువు చేసుకున్నారు. పుదుచ్చేరి వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయనకు ఇటలీలోనే చెబితే అర్థమవుతుందని.. ఏకంగా కేంద్ర మంత్రులు సైతం రాహుల్ గాంధీని ఆటాడేసుకున్నారు.

  పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మత్స్యకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు సంస్కరణలు రైతులకు వ్యతిరేకమని అన్నారు. ఈ దేశ భూమి పుత్రుల (రైతులు)కు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నదని.. కానీ మత్స్యకారులకు మాత్రం మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. తదుపరి తాను పుదుచ్చేరికి వచ్చినప్పుడు మత్స్యకారులతో కలిసి బోటులో ప్రయాణిస్తానని.. వారి కష్టాలు తెలుసుకుంటానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీసిందని ఆరోపించారు.

  రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే గాంధీ పోలికే సమస్యలు తెచ్చిపెట్టింది. కేంద్రంలో మత్స్య రైతులకు మంత్రిత్వ శాఖ ఉన్నదని.. దానిని నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
  అయితే ఈ ట్వీట్ ను ఆయన ఇటలీలో చేయడం గమనార్హం. వ్యవసాయ శాఖ పరిధిలోకే మత్స్యశాఖ వస్తుందని.. సోనియా పుట్టిన ఇటలీ లో కూడా మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని ఆయన ఎద్దేవా చేశారు.


  ఇక ఇదే ట్వీట్ ను మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా షేర్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.

  ట్విట్టర్ లో  నెటిజన్లు కూడా  రాహుల్ గాంధీని ఓ ఆటాడేసుకుంటున్నారు. కేంద్రంలో మత్స్య, పశు సంవర్ధక శాఖ ను ప్రధాని మోడీ 2019 జూన్ లో ప్రారంభించగా.. ప్రస్తుతం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ దానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Bjp, Congress, Puducherry, Rahul Gandhi, Smriti Irani, Twitter, Viral

  ఉత్తమ కథలు