Home /News /national /

BJP MLA SURENDRA NARAYAN SINGH MAKES SEXIST REMARK AGAINST MAYAWATI SAYS SHE GETS FACIALS COLOURS HAIR TO LOOK YOUNG SK

'ఫేషియల్ లేనిదే మాయావతి బయటకు రారు'..బీజేపీ నేత వ్యాఖ్యలపై దుమారం

మాయావతి, సురేంద్ర నారాయణ్ సింగ్

మాయావతి, సురేంద్ర నారాయణ్ సింగ్

నిరాడంబరంగా జీవించాలన్న సిద్ధాంతాలను పక్కనబెట్టి మోదీ రాజభోగాలను అనుభవిస్తున్నారని మాయావతి ఎద్దేవా చేశారు. గతంలో ఛాయ్‌వాలాగా చెప్పుకున్న నేతలు ఇప్పుడు చౌకీదార్‌(కాపలాదారుడు)గా చెప్పుకుంటారని..దేశంలో మార్పు కనిపిస్తోందని సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో సురేంద్ర నారాయణ్ సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

ఇంకా చదవండి ...
  ఎన్నికల వేళ నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఓట్ల కోసం ప్రత్యర్థి నేతలను ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కొందరు నేతలు. ఇప్పటికే ప్రియాంక గాంధీని ఉద్దేశించి పప్పూ కీ పప్పూ అంటూ కేంద్రమంత్రి మహేశ్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో బీజేపీ నేత యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రోజూ ఫేషియల్ లేనిదే మాయావతి బయటకు రారని..తలకు నల్లరంగు వేసుకుంటారని విమర్శించారు. లక్నోలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్.. బీఎస్పీ అధినేత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


  ఆమె (మాయావతి) రోజూ ఫేషియల్ చేయించకుంటారు. నిత్యం ముఖానికి రంగులు పూసుకునే వాళ్లు మోదీ గురించి మాట్లాడుతున్నారు. దుస్తులు ధరించినంత మాత్రాన ఆయన సోగ్గాడు కాదు. 60 ఏళ్ల వయసులో యంగ్‌గా కనిపించేందుకు జుట్టుకు నల్లరంగు వేసుకుంటారు. అలాంటి వారినే భోగి అంటారు. మాయావతి జుట్టు తెల్లబడినా రంగువేసుకొని నల్లగా మార్చుకుంటున్నారు.
  సురేంద్ర నారాయణ్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే

  కాగా, ఇటీవల ప్రధాని మోదీపై మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరాడంబరంగా జీవించాలన్న సిద్ధాంతాలను పక్కనబెట్టి మోదీ రాజభోగాలను అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఛాయ్‌వాలాగా చెప్పుకున్న నేతలు ఇప్పుడు చౌకీదార్‌(కాపలాదారుడు)గా చెప్పుకుంటారని..దేశంలో మార్పు కనిపిస్తోందని సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో సురేంద్ర నారాయణ్ సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. మాయావతి ఫేసియల్ లేని బయటకు రారంటూ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మహిళలను బీజేపీ గౌరవించే తీరు ఇదేనంటూ నిప్పులు చెరుగుతున్నారు విపక్ష నేతలు.
  First published:

  Tags: Bjp, Bsp, Lok Sabha Election 2019, Mayawati, Uttar Pradesh Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు