బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి

తమ పార్టీ ఎమ్మెల్యేది హత్యే అని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఆరోపించింది.

news18-telugu
Updated: July 13, 2020, 11:02 AM IST
బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పశ్చిమ బెంగాల్‌లోని హెమ్తాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రాయ్ ఈ రోజు ఉదయం ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపుతోంది. అయితే ఎమ్మెల్యే కుటుంబసభ్యులు మాత్రం దేబేంద్రనాథ్ రాయ్‌ను చంపేసి, ఆ తరువాత ఉరి తీశారని ఆరోపించారు. ఆ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజలు సైతం ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే ఎమ్మెల్యే మరణానికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని వివరించారు. ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రాయ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయ్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేది హత్యే అని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. దేబేంద్రనాథ్ రాయ్‌ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆ పార్టీ నేత రాహుల్ సిన్హా డిమాండ్ చేశారు. ఆయన హత్య వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించారు. అంతకుముందు సీపీఎం ఎమ్మెల్యేగా ఉన్న రాయ్... 2019లో బీజేపీలో చేరారు.
Published by: Kishore Akkaladevi
First published: July 13, 2020, 10:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading