హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ప్రజలు ఆగ్రహిస్తే అంతే : తమ మాట పట్టించుకోవట్లేదని..అధికార పార్టీ ఎమ్మెల్యేనే బంధించిన గ్రామస్తులు!

ప్రజలు ఆగ్రహిస్తే అంతే : తమ మాట పట్టించుకోవట్లేదని..అధికార పార్టీ ఎమ్మెల్యేనే బంధించిన గ్రామస్తులు!

బీజేపీ ఎమ్మెల్యే శైలేంద్ర

బీజేపీ ఎమ్మెల్యే శైలేంద్ర

BJP MLA Confined By Villagers : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రజాగ్రహానికి గురయ్యాడు. తమ గ్రామంలో అభివృద్ధి పనులు,మౌలిక వసతులు కల్పన గురించి ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఏకంగా ఎమ్మెల్యేనే బంధించారు గ్రామస్థులు.

ఇంకా చదవండి ...

BJP MLA Confined By Villagers : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే(MLA) ప్రజాగ్రహానికి గురయ్యాడు. తమ గ్రామంలో అభివృద్ధి పనులు,మౌలిక వసతులు కల్పన గురించి ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఏకంగా ఎమ్మెల్యేనే బంధించారు గ్రామస్థులు. ఎమ్మెల్యే ఫోన్ లాక్కొన్ని అతడిని ఓ పాఠశాల తరగతి గదిలో ఉంచి తాళం వేసేశారు. అభివృద్ధి పనులు ప్రారంభించే వరకు ఎమ్మెల్యేను వదిలి పెట్టే ప్రశక్తే లేదని గ్రామస్తులు చెబుతున్నారు. బీహార్ రాష్ట్రంలోని భగల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బీహార్(Bihar) రాష్ట్రంలోని భగల్పూర్ జిల్లాలోని బీహ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికిగా బీజేపీ నేత ఇంజనీర్ కుమార్ శైలేంద్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) ఇటీవల 8 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో..మోదీ ప్రభుత్వం చేపట్టిన గొప్ప పనుల గురించి తన నియోజకవర్గంలోని ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే శైలేంద్ర నిర్ణయించారు. అయితే తన నియోజకవర్గంలో తాను చేయాల్సిన పనలు చేయలేదు అన్న సంగతి ఎమ్మెల్యే మర్చిపోయారు. మోదీ ప్రభుత్వం చేసిన పనులపై అవగాహన కల్పించేందుకు లోక్‌మాన్‌పూర్ పంచాయతీలోని హిష్ కుండ్ అనే ఓ గ్రామానికి ఎమ్మెల్యే శైలేంద్ర వెళ్లారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన తన ప్రసంగం మొదలుపెట్టారు. ఇదే సమయంలో కోసి నదిలో నిత్యం నీరు ఉధృతంగా ప్రవహిస్తూ నేల కోతకు గురవుతుండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే ముందు వాపోయారు. గ్రామంలో మట్టి కోతను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, అలా చేయకపోతే అనేక ఇళ్లు పాడైపోయే ప్రమాదం ఉందని, లేదా నీట మునిగిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేను కోరారు.

See pics : సముద్రంలో బంగారు ఓడ..కుప్పలు కుప్పలుగా బంగారం.. దేశం అప్పులు తీరిపోతాయ్..

Shocking : పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనిష్క్ సేల్స్ గర్ల్ పై దారుణం!

కోసి పర్‌లోని లోక్‌మాన్‌పూర్, సింగ్‌కుండ్, బాలు తోలా, మరీచా, కహర్‌పూర్‌లో కోత నిరోధక పనులు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల కోతను అరికట్టేందుకు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. దీనికితోడు అధ్వానమైన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది లేకపోవడంపై గ్రామస్తులు గుర్రుగా ఉన్నారు. ఈ విషయం గురించి ఎమ్మెల్యేని అడగ్గా..ఎమ్మెల్యే శైలేంద్ర తమ మాటలను పట్టించుకోకుండా ప్రయత్నించాడని, ఇది తమకు ఆగ్రహం తెప్పించిందని,దీంతో ఎమ్మెల్యేను స్కూల్ గదిలో దాదాపు రెండు గంటలపాటు బంధించినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానిక పోలీసులు, ఎమ్మెల్యే మద్దతుదారులు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులను శాంతింపజేసి ఎమ్మెల్యేను విడిపించుకున్నారు. ఘటన అనంతరం శైలేంద్ర గ్రామంలో ధర్నాకు దిగారు. అనంతరం ఎమ్మెల్యే తన ఫేస్‌బుక్ పేజీలో..తాను జలవనరుల శాఖ అధికారులను సంప్రదించామని వారు స్పందించలేదని,గ్రామంలో మట్టి కోతను అరికట్టేందుకు వారు ముందుకురావడం లేదని తెలిపారు.

First published:

Tags: Bihar, Bjp

ఉత్తమ కథలు