హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra Modi: ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి ఊహించని షాక్

PM Narendra Modi: ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి ఊహించని షాక్

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

Uttar Pradesh: ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసిలోని రెండు స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది.

  ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగలింది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు సీట్లను బీజేపీ కోల్పోయింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ సొంతం చేసుకుంది. అందులో ఒకటి ఉపాధ్యాయుల నియోజకవర్గం కాగా, మరొకటి పట్టభద్రుల నియోజకవర్గం. వారణాసి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ అభ్యర్థి అశుతోశ్ సిన్హా గెలుపొందగా, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి లాల్‌బిహారీ యాదవ్ విజయం సాధించారు. మొత్తం వంద స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ శాసనమండలిలో 11 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.

  వాటిలో ఐదు పట్టభద్రుల నియోజకవర్గాలు ఉండగా, ఆరు ఉపాధ్యాయుల నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 11 స్థానాల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది. మరో రెండు స్థానాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. బీజేపీకి ఇది రాజకీయంగా పెద్దగా ఇబ్బంది కలిగించే పరిణామం కాకపోయినప్పటికీ.. ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో తాము విజయం సాధించడం పట్ల ఆనందంగా ఉన్నాయి. ఇక ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. మిగితా మూడు స్థానాలను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ సొంతం చేసుకుంది.

  అంతకుమందు వరకు గుజరాత్‌లో పోటీ చేసిన ప్రధాని మోదీ.. 2014లో తొలిసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేసిన నరేంద్రమోదీ... అక్కడ అరవింద్ కేజ్రీవాల్‌పై ఘనవిజయం సాధించారు. 2019లో రెండోసారి ఇక్కడి నుంచే బరిలోకి దిగిన ప్రధాని మోదీ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. మోదీ కంటే ముందు వారణాసి నుంచి బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహన్ జోషి ప్రాతినిథ్యం వహించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Narendra modi, Varanasi

  ఉత్తమ కథలు