హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘చాలా మంది బీజేపీ నేతలు నాతో టచ్ లో ఉన్నారు..’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్.. అసలేం జరిగిందంటే..

‘చాలా మంది బీజేపీ నేతలు నాతో టచ్ లో ఉన్నారు..’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్.. అసలేం జరిగిందంటే..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్)

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్)

Gujarat:  27 ఏళ్ల భారతీయ జనతా పార్టీ దురహంకారాన్ని ఛేదించడమే తమ పార్టీ ప్రణాళిక అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తనతో టచ్ లోనే ఉంటున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

గుజరాత్ లో (Gujarat) ఎన్నికల హీట్ కొనసాగుతుంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం స్పీడును పెంచింది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, (Arvind Kejriwal) పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పలుమార్లు గుజరాత్ ను పర్యటించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఢిల్లీ మోడల్ డెవలప్ మెంట్ చూపిస్తామంటూ ప్రచారం చేశారు.

ఈ క్రమంలో గుజరాత్‌లోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు తన ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రహస్యంగా మద్దతు ఇస్తున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పేర్కొన్నారు.

శనివారం నాడు గుజరాత్‌లోని పలు నగరాల్లో వెలువడిన పోస్టర్‌లపై బీజేపీని ఉద్దేశించి ఆప్ జాతీయ కన్వీనర్ “హిందూ వ్యతిరేకి” అని అభివర్ణించారు. ఆ పోస్టర్‌ల వెనుక ఉన్నవారు.. రాక్షసులు, కన్స్ వారసులని కేజ్రీవాల్ అన్నారు. "చాలా మంది బిజెపి నాయకులు, కార్యకర్తలు నన్ను కలుస్తున్నారు.. అధికార పార్టీని ఓడించడానికి ఏదైనా చేయమని నన్ను రహస్యంగా అడిగారు.

తమ పార్టీని ఓడించాలనుకుంటున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ ఆప్ కోసం రహస్యంగా పని చేయమని నేను చెప్పాలనుకుంటున్నానని ఆయన ర్యాలీలో అన్నారు. గుజరాత్‌లోని గిరిజనులు అధికంగా ఉండే వల్సాద్ జిల్లాలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 27 ఏళ్ల వారి (బీజేపీ) దురభిమానాన్ని మేం ఛేదించాలి. మీకు మీ వ్యాపారాలు ఉన్నాయని నాకు తెలుసు, మీరు మాతో చేరితే మీ వ్యాపారాన్ని దెబ్బతీస్తారు. మీరు అక్కడే ఉండండి, కానీ దానిని ఓడించేందుకు రహస్యంగా పని చేయండని కేజ్రీవాల్ అన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, మీ పార్టీని వీడి ఆప్‌లో చేరండని కేజ్రీవాల్ అన్నారు. రాక్షసులను తరిమికొట్టేందుకు రానున్న ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కొత్త గుజరాత్ కోసం అందరూ ఏకం కావాలి. పార్టీ గురించి పట్టించుకోవద్దు.. గుజరాత్ కోసం పని చేయండి, దేశం కోసం పని చేయండని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ "కొత్త తుఫాను, కొత్త రాజకీయాలు, కొత్త పార్టీ, కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు , కొత్త ఉదయానికి.. నాంది పలుకుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

First published:

Tags: Aravind Kejriwal, Elections, Gujarat

ఉత్తమ కథలు