పార్టీ సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే.. అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (BJP leader Vijayashanti) అన్నారు. మహారాష్ట్ర (Maharastra)లో రాజకీయ సంక్షోభంపై ట్విట్టర్ ద్వారా ఆమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు. లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్ధవ్ తండ్రి బాల్ ఠాక్రే 'శివసేన పార్టీ (Shivasena party)' స్థాపించారు. పొత్తులు, సంకీర్ణ సర్కార్లపై బాల్ ఠాక్రే గారు గతంలో స్పందిస్తూ.. ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహించాలని కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thakery)ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారు అని ఆమె ఆరోపించారు.
కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారితీసింది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 23, 2022
రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా..
“చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీ (BJP)ని దూరం చేసుకున్నారు. చివరికిప్పుడు సొంత పార్టీ వారే తిరుగుబాటు చెయ్యగా.. దిక్కులేక సీఎం పీఠాన్ని (CM seat) వదులుకునేందుకు సిద్ధ పడాల్సి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రేకి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్‌నాథ్ షిండే (Eknath shinde) నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్దవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారి తీసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ (Congress), ఎన్సీపీలతో (NCP) కలసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు అని ఆమె పేర్కొన్నారు. సీఎం ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలో రెబల్ ఎమ్మెల్యే (Rebel MLAs)ల సంఖ్య ఇంకా పెరుగుతోంది’’ అని విజయశాంతి అన్నారు.
ఏం జరిగింది?
మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Crisis) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 40 మందికి పైగా ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) పై తిరుగుబాటు బావుట ఎగురవేయడంతో.. ఆయన తన పదవి నుంచి దాదాపుగా తప్పుకున్నారు. సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి.. మాతోశ్రీకి వెళ్లిపోయారు. ఉద్ధవ్ థాక్రే ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గంలో సంఖ్యా బలం అంకంతకూ పెరుగుతోంది. ఏక్‌నాథ్ టీమ్‌లో ప్రస్తుతం 42 మంది ఉన్నారు. అసోం గువహటిలోని రాడిసన్ బ్లూ హోటల్ వారంతా రిలాక్స్ అవుతున్నారు. తమ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల ఫొటోలు, వీడియోలను ఏక్‌నాథ్ షిండే విడుదల చేశారు. వారితో దిగిన గ్రూప్ ఫొటోను ఆయన మీడియాతో పంచుకున్నారు.
రిసార్ట్‌లో ఉన్న వారి ఫొటోను విడుదల చేయటం ద్వారా.. ఏక్‌నాథ్ షిండే తమ బలప్రదర్శన చేసినట్లయింది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలను పంపుతున్నారు. మరోవైపు కరోనాతో ఆస్పత్రిలో చేరిన గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఇవాళ సాయంత్రం లేదా రేపు రాజ్‌భవన్‌కు చేరుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్ధవ్ మనసులో ఏముందో అర్థం కావడం లేదు. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు గానీ.. రాజీనామా చేయలేదు. పైగా సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆయన వద్ద 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తగినంత సంఖ్యాబలం లేనందున..ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. గవర్నర్ రాజ్‌భవన్‌కు వచ్చిన తర్వాత.. నేరుగా అక్కడికి వెళ్లి..రాజీనామా సమర్పిస్తారని ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharastra, Telangana bjp, Uddhav Thackeray, Vijayashanti