Coronavirus: ఉమాభారతికి కరోనా పాజిటివ్... కాంటాక్టులకు మొదలైన టెన్షన్

ఉమాభారతికి కరోనా పాజిటివ్... (File)

Uma Bharati Covid 19: ఇప్పటికే చాలా మంది నేతలకు కరోనా సోకింది. తాజాగా ఉమాభారతికి కూడా పాజిటివ్ వచ్చింది. ఆమెతో కాంటాక్ట్ అయిన వాళ్లు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.

  • Share this:
    Coronavirus: బీజేపీ జాతీయ ఉప అధ్యక్షురాలు, సీనియర్ పార్టీ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఉమా భారతి స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు. "గత మూడ్రోజులుగా కొద్దిపాటి జ్వరం ఉంది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నాను. డాక్టర్లు నన్ను క్వారంటైన్‌లో ఉండమన్నారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వారంతా వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోండి. టెస్టులు పూర్తయ్యే వరకూ ఎవర్నీ కలవకుండా క్వారంటైన్ అవ్వడం మంచిది" అని ఉమాభారతి తెలిపారు. ఈ విషయం బీజేపీ పెద్దలకు విచారం కలిగించింది.






    ఉమాభారతి జర్నీలో ఉన్నప్పుడు... కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఆమె... వందే మాతరం కంచిల్ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారు. ఇది హరిద్వార్, రుషికేష్ మధ్య ఉంది. నాలుగు రోజుల తర్వాత మరోసారి ఆమెకు టెస్ట్ చేయనున్నారు. అప్పుడు కూడా తనకు కరోనా పాజిటివ్ వస్తే... ఏం చెయ్యాలనే అంశంపై పూర్తి స్థాయి యాక్షన్ తీసుకుంటారని ఆమె వివరించారు. ప్రస్తుతం తన వల్ల ఇతరులకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు ఉమా తెలిపారు.




    ప్రస్తుతం ఇండియాలో కొత్తగా 85362 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 59,03,932కి పెరిగింది. కొత్తగా 1089 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 93,379కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతం ఉండగా... ప్రపంచ దేశాల్లో అది 3 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 93420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 48,49,584కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు మరింత పెరిగి 82.1 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,60,969కి చేరింది.

    మన దేశంలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఆగస్ట్ 7 నాటికి దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆగస్ట్ 23 నాటికి అది 30 లక్షలకు చేరింది. సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షల కేసులొచ్చాయి. గత 25 రోజులుగా రోజూ 1000 మందికి పైగా కరోనాతో చనిపోతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: