• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • BJP LEADER UMA BHARTI TESTED POSITIVE FOR COVID ADMITTED TO AIIMS NK

Uma Bharti Covid 19: కరోనాతో ఎయిమ్స్‌లో చేరిన ఉమాభారతి...

ఉమాభారతికి కరోనా పాజిటివ్... (File)

Uma Bharti Covid 19 AIIMS: ఈమధ్య కరోనా పాజిటివ్‌గా తేలారు ఉమాభారతి. ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ట్రీట్‌మెంట్ అందిస్తోంది.

  • Share this:
    Uma Bharti Covid 19 AIIMS: బీజేపీ జాతీయ ఉప అధ్యక్షురాలు, సీనియర్ పార్టీ నేత ఉమాభారతి... ఉత్తరాఖండ్... రుషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - ఎయిమ్స్ (AIIMS)లో చేరారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఉమాభారతి... ట్వీట్ ద్వారా... శనివారం దేశ ప్రజలకు తెలిపారు. "గత మూడ్రోజులుగా కొద్దిపాటి జ్వరం ఉంది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నాను. డాక్టర్లు నన్ను క్వారంటైన్‌లో ఉండమన్నారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వారంతా వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోండి. టెస్టులు పూర్తయ్యే వరకూ ఎవర్నీ కలవకుండా క్వారంటైన్ అవ్వడం మంచిది" అని ఉమాభారతి తన ట్వీట్‌లో తెలిపారు. ఈ విషయం బీజేపీ పెద్దలకు విచారం కలిగించింది. తాజాగా సోమవారం ఆమెకు ఎయిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి... కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

    ఉమాభారతి జర్నీలో ఉన్నప్పుడు... కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఆమె... వందే మాతరం కంచిల్ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారు. ఇది హరిద్వార్, రుషికేష్ మధ్య ఉంది. ఈ విషయం తెలుసుకున్న రుషికేష్ ఎయిమ్స్... శనివారమే ఉమాభారతి కోసం... ఎందుకైనా మంచిదని ముందస్తుగా ఏర్పాట్లు చేసింది ఎయిమ్స్. రెండ్రోజుల్లో ఉమాభారతికి మళ్లీ టెస్ట్ చేయనున్నారు. అప్పుడు కూడా తనకు కరోనా పాజిటివ్ వస్తే... ఏం చెయ్యాలనే అంశంపై పూర్తి స్థాయి యాక్షన్ తీసుకోనున్నారు. ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ కాబట్టి... ఆమెకు కోలుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని నేతలు, అధికారులు అంటున్నారు.


    ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, అమెరికా ఉన్నాయి. షాకింగ్ విషయమేంటంటే... మనం అమెరికా కేసుల కంటే 12లక్షలు మాత్రమే వెనక ఉన్నాం. అంటే... ఓ 20 రోజుల్లో ఇండియా... అమెరికాను వెనక్కి నెట్టి... మొత్తం కేసుల్లో టాప్‌కి వెళ్లగలదనే సంకేతాలున్నాయి.


    ఇండియాలో 82వేల 170 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60,74,702కి చేరింది. 24 గంటల్లో 1039 మంది చనిపోయారు. 27 రోజులుగా దేశంలో రోజూ వెయ్యి కంటే ఎక్కువ మందే కరోనాతో చనిపోతున్నారు. ఇండియాలో మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 3.01 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 74,893 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. మొత్తం రికవరీలు 50లక్షల 16వేల 520కి చేరాయి. దేశంలో రికవరీ రేటు 82.6 శాతంగా ఉంది. ఇండియాలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 9,62,640 ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: