Agriculture Reform Laws: పంజాబ్‌లో రైతుల నిరసనలు మరి కాస్త తీవ్ర రూపు దాల్చాయి. తాజాగా హోషియార్పూర్ బీజేపీ నేత తిక్షాన్ సూద్ ఇంటి ముందు ఎవరో గానీ... ట్రాక్టర్‌తో పేడ తెచ్చి వేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను వ్యతిరేకించేవారే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం సీఎం అమరీందర్ సింగ్ దాకా వెళ్లింది. దీనిపై ఆయన స్పందించారు. నిరసనల పేరుతో... ఇలాంటి వేధింపులకు పాల్పడితే... ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. నిన్న కొంత మంది రైతులు... తిక్షాన్ సూద్ ఇంటి బయట ధర్నా చేశారు. వాళ్లను ఆయన పట్టించుకోలేదు. నాకేం సంబంధం లేదు అన్నట్లు వ్యవహరించారు. ఆ సమయంలో వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో ఎవరో ఈ పేడ కుప్ప తెచ్చి ఇంటి ముందు వేసి ఉంటారని ఇప్పుడు భావిస్తున్నారు.
స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పినా... ఎమ్మెల్యే మాత్రం ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ధర్నాకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యేనే ధర్నాలో కూర్చోవడంతో... పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికిప్పుడు వెళ్లి... పేడ వేసిన వారిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాగని ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే... బీజేపీ ఎమ్మెల్యే ఏం చేస్తారో అనే టెన్షన్ ఉంది. దీంతో... విషయం సీఎం అమరీందర్ సింగ్‌కి తెలిసింది. తిక్షాన్ సూద్‌ని చల్లబరచడానికి అన్నట్లు... సీఎం... ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఓ హెచ్చరిక డైలాగ్ విసిరారు. ఆందోళనలు ప్రశాంతంగా చేసుకోవాలి గానీ... ఇలా చెయ్యడం కరెక్టు కాదన్నారు.
Trolley of cowdung dumped @BJPPunjab Tikshan Sood’s house is exactly same like Modi passed 3 farmer bills. No one demanded, but given by force. I hope BJP will understand from this example that why farmers opposing these black laws. #pbpoli@BJP4Indiapic.twitter.com/EJlnvsFz9B
ఇకపై ఇలాంటివి మరిన్ని జరుగుతాయేమో అనే టెన్షన్ ఇప్పుడు పోలీసులకు పట్టుకుంది. ఏ అర్థరాత్రో, ఎవరో, ఏ ఎమ్మెల్యే ఇంటి ముందో పేడ వేస్తే... తాము ఏం చెయ్యగలమన్న టెన్షన్లో ఉన్నారు పోలీసులు. పంజాబ్‌కి ఓ సంస్కృతి ఉందనీ... పంజాబ్ ప్రజలు పద్ధతి ప్రకారం నడుచుకుంటారని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ కుమార్ శర్మ కూడా దీనిపై కామెంట్ చేశారు. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెల రోజులకు పైగా పంజాబ్, హర్యానా, యూపీ సహా కొన్ని రాష్ట్రాల్లోని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్నారు. కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. గత నెలలో పంజాబ్ లోని ఫగ్వారాలో... బీజేపీ నేతల ఇళ్లను ముట్టడించడంతో... వారు పోలీస్ రక్షణలో... వెనక డోర్ నుంచి బయటపడాల్సి వచ్చింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.