హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం..హాజరైన మోదీ,షా

Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం..హాజరైన మోదీ,షా

Image credit : ANI

Image credit : ANI

Gujarat CM oath taking ceremony: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat assembly elections)రికార్డు మెజార్టీ సీట్లు గెల్చుకుని వరుసగా ఏడోసారి భారతీయ జనతా పార్టీ(BJP)అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 సీట్లను బీజేపీ గెల్చుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Gujarat CM oath taking ceremony: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat assembly elections)రికార్డు మెజార్టీ సీట్లు గెల్చుకుని వరుసగా ఏడోసారి భారతీయ జనతా పార్టీ(BJP)అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 సీట్లను బీజేపీ గెల్చుకుంది. బీజేపీ విజయం నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ నాయకుడు 60 ఏళ్ల భూపేంద్ర పటేల్(Bhupendra patel)గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయన చేత ప్రమాణం చేయించారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్‌ భవనం సముదాయంలో ఉన్న హెలిపాడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi),కేంద్ర హోం మంత్రి అమిత్ షా,రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ,గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ,ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా,అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటివరకూ ఉన్న విజయ్ రూపానీని తొలగించి భూపేంద్రను బీజేపీ హైకమాండ్ సీఎంగా కూర్చోబెట్టింది. ఆ నిర్ణయం సరైనదేనని భూపేంద్ర నిరూపించారు.తాజా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే బీజేపీ చారిత్రక విజయం సాధించడంతో మరోసారి పార్టీ అధిష్ఠానం ఆయనకే పాలనా పగ్గాలు అప్పజెప్పింది. ఈ ఎన్నికల్లో సీఎం భూపేంద్ర పటేల్..అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఇక,సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు మరో 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో కున్వర్జీభాయ్ మోహన్‌భాయ్ బవలియా, ములు అయర్ బేరా,కాను దేశాయ్, హృషీకేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్ సింహ్ రాజ్‌పుట్, కుబేర్ డిండోర్, భాను బబారియా, హర్ష సంఘవి, జగదీశ్ విశ్వకర్మ, రజనీకాంత్ పటేల్ ఉన్నారు.

First published:

Tags: Bhupendrabhai Patel, Gujarath CM

ఉత్తమ కథలు