• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BJP LEADER 19 OTHERS BOOKED FOR ORGANISING CRICKET MATCH DURING LOCKDOWN IN UP SK

లాక్‌డౌన్ వేళ క్రికెట్ మ్యాచ్.. బీజేపీ నేత సహా 20 మందిపై కేసు

లాక్‌డౌన్ వేళ క్రికెట్ మ్యాచ్.. బీజేపీ నేత సహా 20 మందిపై కేసు

యూపీలో ఇప్పటి వరకు 1473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 173 మంది కోలుకోగా.. 21 మంది మరణించారు.

యూపీలో ఇప్పటి వరకు 1473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 173 మంది కోలుకోగా.. 21 మంది మరణించారు.

  • Share this:
    లాక్‌డౌన్‌తో యావత్ దేశం నిర్మానుష్యంగా మారింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాను తరిమికొట్టేందుకు సామాజిక దూరం పాటిస్తున్నారు. ఐతే కొందరు మాత్రం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వాలకు సహకరించకుండా ఇష్టారీతిన తిరుగుతున్నారు. నగరాలు, పట్టణాల్లో నిఘా ఎక్కువగా ఉండడంతో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. కానీ గ్రామాల్లో చాలా మంది యువత క్రికెట్, ఇతర ఆటలతో పాటు పొలాల్లోకి వెళ్లి చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. బారబంకీ జిల్లాలోని పానపూర్ గ్రామంలో స్థానిక యువత క్రికెట్ ఆడారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అంతా గుమిగూడి క్రికెట్ ఆడారు. దీనిపై కొందరు స్థానికులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగి మ్యాచ్‌ని నిలిపివేశారు.

    గ్రౌండ్‌లో ఉన్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ నిర్వహణకు స్థానిక బీజేపీ నేత సుధీర్ కారణమని గుర్తించిన పోలీసులు.. ఆయనతో పాటు క్రికెట్ ఆడిన మిగతావారిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను హెచ్చరించారు. యూపీ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 173 మంది కోలుకోగా.. 21 మంది మరణించారు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లో 1279 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు