news18
Updated: November 10, 2020, 10:56 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 10, 2020, 10:56 AM IST
దేశవ్యాప్తంగా కమలాలు విరభూస్తున్నాయి. బీహార్ లో హోరాహోరి పోరు నడుస్తున్నా.. ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ) కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా రెండు గంటలు ముగిసేసరికి అధికార బీజేపీ అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నది.
రెండు గంటలు ముగిసేసరికి బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 8 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. రెండు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాల సరళిని పరిశీలించడానికి అన్ని పార్టీల అధినాయకులు పార్టీ కార్యాలయాలకు చేరుకున్నారు. అక్కడ్నుంచే ఫలితాల సరళిని అంచనా వేస్తున్నారు.
ఇంగ్లీషులో మధ్యప్రదేశ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి MP By Election Result 2020
ఏడు నెలల క్రితం కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిట్టనిలువునా కూల్చిన జ్యోతిరాధిత్య సింధియా.. 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్ కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవడానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మరో 8 సీట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే అదేమంత పెద్దగా కష్టమనిపించడం లేదు.
Published by:
Srinivas Munigala
First published:
November 10, 2020, 10:56 AM IST