Home /News /national /

BJP GOVT FORMATIONS UPDATES PRAMOD SAWANT DECLARED GOA CM AND PUSHKAR DHAMI GETS SECOND TERM IN UTTARAKHAND MKS

4 డబుల్ ఇంజన్లకు మళ్లీ పాత డ్రైవర్లు -PM Modi నిర్దేశాలివే -ఎన్నికల్లో ఓడినా సీఎం పదవి..

ఉత్తరాఖండ్, గోవాకు సీఎంల ఖరారు

ఉత్తరాఖండ్, గోవాకు సీఎంల ఖరారు

బీజేపీ అధికారం నిలబెట్టుకున్న నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అనూహ్యరీతిలో ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఓడిపోయిన పుష్కర్ ధామికే మళ్లీ సీఎంగా అవకాశం కల్పించారు. పూర్తి వివరాలివే..

కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ స్పీడుతో అభివృద్దిని పరుగులు తీయించవచ్చని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ డబుల్ ఇంజన్ల డ్రైవర్లుగా మళ్లీ పాతవారినే ఎంచుకోవడం గమనార్హం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన నాలుగు రాష్ట్రాలనూ నిలబెట్టుకోగా, ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం రాత్రి కీలక సమావేశం జరిగింది. ఆయన నిర్దేశాల మేరకు సోమవారం సాయంత్రానికి ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. అనూహ్యరీతిలో ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఓడిపోయిన పుష్కర్ ధామికే మళ్లీ సీఎంగా అవకాశం కల్పించారు. పూర్తి వివరాలివే..

బీజేపీ హైకమాండ్ నిర్ణయాలకు సంబంధించి తొలి నుంచీ క్లారిటీ ఏర్పడిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ 37 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం, యోగి ఆదిత్యానాథ్ మరోసారి సీఎం కానుండటం తెలిసిందే. ఈనెల 25న యోగి రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. యోగి కేబినెట్ 2.0పైనా ప్రధాని కీలక సూచనలు చేస్తున్నారు. ఇక..

CM KCR | Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలన రహస్యాలు చెప్పిన కేసీఆర్.. ప్యాకేజీ రూ. 3వేల కోట్లు!


చిన్న రాష్ట్రం గోవాలో స్వతంత్రుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. కానీ ప్రమోద్ సావంత్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలా? కొత్తవారికి అవకాశం కల్పించాలా? అనే అంశంపై చివరిదాకా ఉత్కంఠకొనసాగింది. ఎట్టకేలకు సావంత్ కే మరోసారి అవకాశం కల్పిస్తూ పార్టీ హైకమాండ్ సోమవారం నాడు నిర్ణయాన్ని ప్రకటించింది. ఉత్తరాఖండ్ లో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఓడిపోయిన పుష్కర్ సింగ్ ధామిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.

Rajya Sabhaకు AAP భల్లే ఎంపిక: హర్భజన్ సింగ్ ఇక ఎంపీ.. పెద్దలసభలో చిన్నోడు రాఘవ్ చద్దా.. పూర్తి జాబితా ఇదే


ఉత్తరాఖండ్ లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం డెహ్రాడూన్ లో సమావేశమై, బీజేపీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ బీజేపీ నేతలతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించారు. ఇవాళ సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ధామీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

Russia బోనులో నిలబడాల్సిందే: PM Modiతో సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని వ్యాఖ్యలు -29 కళాఖండాల అప్పగింత


ఈనెల 23న అంటే, బుధవారం నాడు ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ ధామి రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉత్తరాఖండ్ లో శాసన మండలి లేనందున ఎమ్మెల్సీ చేపట్టి సీఎంగా కొనసాగే అవకాశం లేకపోవడంతో ధామి రాబోయే 6 నెలల్లోగా ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 47 చోట్ల గెలిచి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక, మణిపూర్ లోనూ సీఎం మార్పు ఉంటుందని భావించినా, బీరేన్ సింగ్ ను తిరిగి సీఎంగా కొనసాగిస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. మణిపూర్ సీఎంగా బీరేన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bjp, Goa, Pm modi, Uttarakhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు