సౌత్‌పై ఫోకస్... నాలుగు రాష్ట్రాలపై బీజేపీ దృష్టి... లాగేసుకుంటుందా?

2023లో జమిలి ఎన్నికలు జరిపిస్తామంటున్న బీజేపీ... ఆలోపే... దక్షిణాదిలోని 4 కీలక రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 7, 2019, 6:29 AM IST
సౌత్‌పై ఫోకస్... నాలుగు రాష్ట్రాలపై బీజేపీ దృష్టి... లాగేసుకుంటుందా?
New Delhi: Bhartiya Janata Party President Amit Shah addresses a press conference, in New Delhi on Monday. (PTI Photo /Kamal Singh)(PTI5_21_2018_000133B)
  • Share this:
కర్నాటకం చూస్తూనే ఉన్నాం. రేపో, మాపో అక్కడ బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణగా కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ... అక్కడ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న తర్వాత... టీఆర్ఎస్ సర్కారును నీటి బుడగతో పోల్చుతోంది. తాజాగా తెలంగాణలో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం కోసం వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... పార్టీ రాష్ట్ర వర్గాలకు క్లియర్ పిక్చర్ ఇచ్చేశారు. మొహమాటం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడమని ఆదేశించారు. అసలు టీఆర్ఎస్‌తో ఎలాంటి లాలూచీ, సంబంధాలు, తెరవెనక ఒప్పందాలు లేవనీ, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా... బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాదు... టీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతోందనీ, వాటిపై పోరాడాలనీ, రాష్ట్ర స్థాయిలో పని జరగకపోతే, కేంద్ర స్థాయిలో తాము రంగంలోకి దిగి... టీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామని అమిత్ షా చెప్పారు. సో, కర్ణాటక తర్వాతి టార్గెట్ తెలంగాణ అని అనుకోవచ్చు. మరి బీజేపీని ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు.

తెలంగాణ తర్వాతి టార్గెట్‌గా కేరళ కనిపిస్తోంది. ఇప్పటివరకూ కొరకరాని కొయ్యలా ఉన్న కేరళలో ఏం చేసైనా అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కేరళలో వస్తే... అప్పుడు... సౌత్‌లో తమిళనాడు, ఏపీ తప్ప మిగతా రాష్ట్రాలు కవరైనట్లేనని బీజేపీ లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే... కేరళ తర్వాతి టార్గెట్‌గా కమల దళం... ఏపీని ఎంచుకోవడం కీలక పాయింట్. పైకి ఏపీలోని వైసీపీ సర్కారుతో సన్నిహితంగా, స్నేహభావంతో మెలగుతున్నట్లు కనిపిస్తున్న కమలనాథులు... తెరవెనక వేగంగానే పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతిపక్ష టీడీపీ నుంచీ ఎమ్మెల్యేలను ఆకర్షించడంతోపాటూ... పోలవరం సహా చాలా అంశాల్లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా... జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

2023లో జమిలి ఎన్నికలు జరిగితే... తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నా... ఏపీలో మాత్రం అధికారం రాదు అని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ఏపీలో అధికారాన్ని దక్కించుకునేందుకు 2023 తర్వాత మరింత బలంగా ప్రయత్నించాలనే అంచనాలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ... ఇప్పటి నుంచే అందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక మిగిలిన తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో ప్రస్తుతానికి సఖ్యతగా ఉన్న బీజేపీ... ఎప్పుడు రూల్స్ మార్చేస్తుందో అంచనాకి అందని పరిస్థితి. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష DMK... మొత్తం 39 స్థానాల్లో ఒక్కటి తప్ప... 38 గెలుచుకుంది. అందువల్ల ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా... DMK గెలవడం ఖాయమని చెప్పవచ్చు. అందువల్ల అక్కడ బీజేపీకి ప్రస్తుతానికి ఆశలు లేవు. ఏది ఏమైనా జమిలి ఎన్నికలకు ముందే... వీలైనంతగా సౌత్‌లో పాగా వేసేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు మాత్రం ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు తలనొప్పిగానే మారుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

First published: July 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...