బీజేపీకి బూస్ట్..యోగి ఇలాఖాలో 'రేసుగుర్రం' విలన్..

రవికిషన్‌కు భోజ్‌పురీ మెగాస్టార్‌గా పేరుంది. భోజ్‌పురి సినిమాలు, టీవీ సీరియళ్లతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ రవి కిషన్ నటించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో రవికిషన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

news18-telugu
Updated: April 15, 2019, 6:05 PM IST
బీజేపీకి బూస్ట్..యోగి ఇలాఖాలో 'రేసుగుర్రం' విలన్..
యోగి ఆదిత్యనాథ్, రవి కిషన్
news18-telugu
Updated: April 15, 2019, 6:05 PM IST
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలాఖా గోరఖ్‌పూర్‌లో లోక్‌సభ ఫైట్ రసవత్తరంగా మారింది. గతంలో తమకు కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌లో రేసుగుర్రం విలన్ రవికిషన్‌ను బరిలోకి దిపింది బీజేపీ. ఉత్తర్ ప్రదేశ్‌ లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి మరో ఏడుగురి పేర్లను బీజేపీ హైకమాండ్ సోమవారం ప్రకటించింది. అందులో రవి కిషన్‌తో పాటు గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎంపీ ప్రవీణ్ కుమార్ నిషాద్‌కు చోటుదక్కింది. ప్రవీణ్ ఈసారి సంత్ కబీర్‌నగర్ నుంటీ పోటీ చేయనున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల జరిగే వరకు బీజేపీకి గోరఖ్‌పూర్ కంచుకోటగా ఉండేది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గెలిచారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో సీఎం పగ్గాలను యోగికి అప్పగించారు. అనంతరం జరిగిన గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీచేయడంతో యోగి కోటకు బీటలు వారాయి. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీచేసిన ప్రవీణ్ కుమార్ నిషద్ భారీ మెజార్టీతో విజయం సాధించి బీజేపీకి షాకిచ్చారు.

కొన్ని రోజుల క్రితం ఎస్పీని వీడిన ప్రవీణ్..బీజేపీలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను గోరఖ్‌పూర్ నుంచి సంత్ కబీర్‌నగర్‌కు మార్చారు కమలం పెద్దలు. గోరఖ్‌పూర్‌లో భోజ్‌పురి మెగాస్టార్ రవి కిషన్‌ను బరిలోకి దింపింది. భోజ్‌పూరి ఎక్కువగా మాట్లాడే పూర్వాంచల్‌లో రవికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు గోరఖ్‌పూర్ టికెట్ దక్కింది.

ఇక సంత్ కబీర్‌నగర్ సిట్టింగ్ ఎంపీ త్రిపాఠికి ఈసారి మొండి చేయి చూపింది బీజేపీ హైకమాండ్. స్థానిక ఎమ్మెల్యేను త్రిపాఠి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించారు.
రవికిషన్‌కు భోజ్‌పురీ మెగాస్టార్‌గా పేరుంది. భోజ్‌పురి సినిమాలు, టీవీ సీరియళ్లతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ రవి కిషన్ నటించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో రవికిషన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మద్దాలి శివారెడ్డి పాత్రలో విలన్‌గా నటించిన రవికిషన్..తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం కిక్ 2, సుప్రీమ్, ఒక అమ్మాయి తప్ప, రాధ, లై, ఎమ్మెల్యే, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించారు.
First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...