హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Himachal Pradesh: హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ దూకుడు..అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన ఇరు పార్టీలు

Himachal Pradesh: హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ దూకుడు..అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేసిన ఇరు పార్టీలు

బీజేపీ, కాంగ్రెస్

బీజేపీ, కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp)  అభ్యర్థుల వేటలో పడ్డారు. కాంగ్రెస్ (Congress) 46 అభ్యర్థులతో కూడిన లిస్ట్ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాంగ్రెస్ (Congress), బీజేపీ (Bjp)  అభ్యర్థుల వేటలో పడ్డారు. కాంగ్రెస్ (Congress) 46 అభ్యర్థులతో కూడిన లిస్ట్ విడుదల చేసింది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా (Jp Nadda) సమక్షంలో జరిగిన సమావేశానికి ప్రధాని మోడీ (Pm Modi) సహా పలువురు కేంద్రమంత్రులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తీవ్ర కసరత్తు తరువాత 62 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ ను రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ (jairam thakoor) సిరాజ్ స్థానం నుంచి పోటీ చేయనుండగా..ఉనా నుంచి సత్పాల్ సింగ్ (Sathpal Singh),  మాజీ కేంద్ర మంత్రి సుఖ్ రామ్ తనయుడు అనిల్ శర్మ మండీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.

ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..హిమాచల్ ప్రదేశ్ లో అక్టోబర్ 17వ తేదీన ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుండగా..నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 25 చివరి తేదీ. అక్టోబర్ 27న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 చివరి తేదీ.  నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కాగా ఈ ఎన్నికలను ఒకే విడతలో జరపనున్నట్లు ఈసీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను మాత్రం ఈసీ ఇవ్వలేదు.

Congress President Election Result: ఖర్గేనా? థరూరా? కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు? నేడే కౌంటింగ్

 మొత్తం స్థానాల్లో మెజారిటీ సంఖ్య 35. 2017 సంవత్సరంలో రాష్ట్రంలోని 17 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45, కాంగ్రెస్ 20, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా ఏ పార్టీ గెలవలేదు.  హిమాచల్ ప్రదేశ్  (Himachal Pradesh) అసెంబ్లీ 2023 జనవరి 8తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ (Election Comission) ప్రకటించింది.

గుజరాత్ ఎన్నికలు అందుకే ఆలస్యం:

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఆలస్యంపై ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. హిమాచల్, గుజరాత్ ల శాసనసభ గడువు ముగియడానికి 40 రోజులు తేడా ఉంది. హిమాచల్ లో వాతావరం పాత్ర ముఖ్యం. ఎందుకంటే అక్కడ హిమపాతం ఎక్కువగా కురుస్తుంది. అందుకే ఈసారి గత సాంప్రదాయాన్ని ఈసీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అందుకే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కు సమయం పట్టేలా ఉందని ఈసీ స్పష్టం చేసింది.

First published:

Tags: Elections, Himachal Pradesh, India

ఉత్తమ కథలు