Bihar Elections 2020: బీహార్‌లో ‘ఓటుకు వ్యాక్సిన్’ వివాదం.. ఫ్రీ వ్యాక్సిన్‌పై స్పందించిన బీజేపీ

జనతాదళ్ యునైటెడ్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ.. తమ కూటమి ఎన్నికల్లో గెలిస్తే బీహార్ వాసులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది.

news18-telugu
Updated: October 22, 2020, 7:47 PM IST
Bihar Elections 2020: బీహార్‌లో ‘ఓటుకు వ్యాక్సిన్’ వివాదం.. ఫ్రీ వ్యాక్సిన్‌పై స్పందించిన బీజేపీ
బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
  • Share this:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్రంలో బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. జనతాదళ్ యునైటెడ్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ.. తమ కూటమి ఎన్నికల్లో గెలిస్తే బీహార్ వాసులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోలో ప్రకటించింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ నేతలు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే, మేనిఫెస్టోలో ‘ఓటుకు వ్యాక్సిన్’ అంశం పెద్ద దుమారానికి దారి తీసింది. బీహార్ వాసులకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తుంటే, మిగిలిన దేశం మొత్తానికి ఇవ్వరా? అనే చర్చ మొదలైంది. అసలు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ఇస్తుంటే, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదేముందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.



అయినా, ప్రజల క్షేమం కోరే ప్రభుత్వాలు వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలు చేయడం ఏంటంటూ ధ్వజమెత్తాయి. మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామంటూ ‘ఓటుకు వ్యాక్సిన్’ రాజకీయాలు చేస్తుందంటూ బీజేపీ మీద విమర్శలు గుప్పించాయి.



ఈ అంశం పెద్ద దుమారం రేగడంతో బీజేపీ స్పందించింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్ ‌చార్జి అమిత్ మాలవీయ స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నామమాత్రపు ధరకు వ్యాక్సిన్ అందిస్తుంది. అయితే, దాన్ని రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇవ్వడమా లేకపోతే ఆ ధరను ప్రజల వద్దే వసూలు చేయడమా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. బీహార్‌లో మాత్రం బీజేపీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.’ అని అమిత్ మాలవీయ తెలిపారు.



అయితే, అసలు కరోనా వ్యాక్సిన్‌ రావడానికి ఇంకా ఏడాది పట్టొచ్చని సీసీఎంబీ సీఈవో మధుసుధన్‌రావు అన్నారు. కరోనా కేసులు మాత్రమే తగ్గాయని, తీవ్రత తగ్గిందని చెప్పలేమన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారాయన. అజాగ్రత్తగా ఉంటే లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా లండన్‌లో వికటించగా... బ్రెజిల్‌లోనూ వికటించింది. టీకా వేసుకున్న తర్వాత వాలింటిర్‌ చనిపోవడం సంచలనంగా మారింది. దీంతో బ్రెజిల్‌లో హ్యూమన్ ట్రయిల్స్‌ను నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం. మొత్తానికి ఇప్పుడు సీసీఎంబీ సీఈవో చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇదిగో వ్యాక్సిన్ వచ్చేస్తోందని ప్రకటించిన తరుణంలో ఇప్పుడు సీసీఎంబీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 22, 2020, 7:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading