బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న వేడుకల్లో ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలసి పుణ్యస్నానాలు చేశారు. గంగానది, యమునానది, సరస్వతి నదులు కలిసే సంగమ ప్రాంతంలో వారు స్నానాలు ఆచరించారు. అనంతరం త్రివేణి ఘాట్‌లో పుణ్యనదులకు హారతి ఇచ్చారు.
త్రివేణి సంగమం అనేది హైందవులకు అత్యంత పవిత్ర స్థలం. అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం. అందుకే నదీతీర ప్రాంతంలో వేలాదిగా క్యాంప్‌లు వేసుకుని కుంభమేళా సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.
పుణ్యస్నానాల అనంతరం అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబా రాందేవ్‌తో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. జునా అఖాడా ఆశ్రమంలో ఆచార్య మహామండలేశ్వర్ అవదేశానంద్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
PICS: కుంభమేళాలో అమిత్ షా పుణ్యస్నానాలు