హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bengal Violence: కేంద్రమంత్రి కారుపై దాడి.. బెంగాల్‌లో కొనసాగుతున్న హింస

Bengal Violence: కేంద్రమంత్రి కారుపై దాడి.. బెంగాల్‌లో కొనసాగుతున్న హింస

మే2 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. బీజేపీ, టీఎంసీ వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయి. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరణించారని బీజేపీ తెలిపింది.

  ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో హింస కొనసాగుతోంది. బీజేపీ, టీఎంసీ మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్. వెస్ట్ మిడ్నాపూర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఆ దృశ్యాలను ట్విటర్‌లో షేర్ చేశారు మురళీధరన్. టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. తమ సిబ్బందిపైనా దాడి చేశారని.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో తన పర్యటను త్వరగా ముగించినట్లు కేంద్రమంత్రి మురళీధరన్ వెల్లడించారు.

  కేంద్రమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా టీఎంసీ జెండాలను పట్టుకున్న కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌లోని ఓ కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేస్తూ కనిపించారు. పలువురు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని రోడ్లపై తిరిగారు. దుండగుల దాడిలో కాన్వాయ్‌లోని కార్లు ధ్వంసమయ్యాయి.

  మే2 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. బీజేపీ, టీఎంసీ వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయి. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మరణించారని బీజేపీ తెలిపింది. పలువురి ఇళ్లపైనా దాడి చేసి లూటీ చేశారని.. మహిళలపై అత్యాచాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ అండ చూసుకునే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు పేట్రేగిపోతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

  పశ్చిమ బెంగాల్ ఎన్నిల ఫలితాలు మే2న వెల్లడయ్యాయి. మొత్తం 292 సీట్లలో... అధికార పార్టీ ఏకంగా 213 సీట్లలో గెలిచింది. బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రీయ సెక్యులర్ మజ్లిస్ పార్టీ ఒక చోట గెలిచింది. మరొక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అఖండ మెజార్టితో టీఎంసీ గెలవడంతో మే 5న మమతా బెనర్జీ మూడోసారి పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే టీఎంసీ గెలిచినప్పటికీ సీఎం మమత మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్‌లో బీజేపీ నేతు సువేందు అధికారి చేతిలో 1600కు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అభ్యర్థులు మరణించడంతో మరో రెండు సీట్లలో పోలింగ్ వాయిదా పడింది. అక్కడ త్వరలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో మమత బెనర్జీ బెనర్జీ పోటీచేసే అవకాశముంది.

  First published:

  Tags: Mamata Banerjee, TMC, Trinamool congress, West Bengal

  ఉత్తమ కథలు