ఒడిశాలో తిరుగులేని బీజేడీ...వరుసగా 5వ సారి సీఎంగా నవీన్...

నవీన్ పట్నాయక్ (File)

ఒడిశాలో బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డింది అయినప్పటికీ బీజేడీ మాత్రం తన పట్టును నిలుపుకోవడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశవ్యాప్తంగా బలంగా వీచిన మోదీ గాలులను తట్టుకొని మరీ నిలవడం విశేషం.

  • Share this:
    ఒడిశాలో ఓటర్లు అనూహ్యమైన తీర్పును ఇచ్చారు. వరుసగా 5వ సారి నవీన్ పట్నాయక్ పట్టం కట్టారు. దీంతో సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగుతున్న అరుదైన రికార్డును నవీన్ సొంతం చేసుకున్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా అధికార బిజు జనతాదళ్ పార్టీనే ఇక్కడ అధికారంలోకి వస్తుండగా, ఈ సారి కూడా అదే తరహా ఫలితాలు వచ్చాయి. మొత్తం 147 సీట్లకు గానూ బీజేడీ 113 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 19, కాంగ్రెస్ 13 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఇప్పటికే నాలుగుసార్లు పూర్తికాలం సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేయడం లాంఛనంగా మారింది. మరోవైపు అయితే అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. బీజేపీ మొత్తం 8 స్థానాలు ఎంపీ కైవసం చేసుకుంది. అయితే అధికార బీజేడీ సైతం 14 సీట్లను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గతం కన్నా బీజేపీ ఈ సారి ఒడిశాలో పుంజుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకోగా, ఈ సారి ఏకంగా 8 సీట్లకు ఎగబాకింది. మరోవైపు కాంగ్రెస్ ఒడిశాలో పూర్తిగా క్షీణించింది.

    ఇదిలా ఉంటే ఈ సారి ఒడిశాలో బీజేపీ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డింది అయినప్పటికీ బీజేడీ మాత్రం తన పట్టును నిలుపుకోవడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశవ్యాప్తంగా బలంగా వీచిన మోదీ గాలులను తట్టుకొని మరీ నిలవడం విశేషం.
    First published: