వరుస పరాజయాలు, నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad Resigns) ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి నాలుగు పేజీల లేఖ రాశారు. ఈ సందర్భంగా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆజాద్. కాంగ్రెస్ పార్టీని అనుభవం లేని సైకోఫాంటిక్ నాయకుల కొత్త సర్కిల్‌గా ఆయన అభివర్ణించారు. భారత్ జోడి యాత్రను ప్రారంభించే ముందు కాంగ్రెస్ జోడి యాత్ర చేసి ఉండాలని విమర్శించారు. తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)పైనా విమర్శలు గుప్పించారు. ఆయనలో రాజకీయ పరిపక్వత లేదని.. ఇంకా చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక మళ్లీ వాయిదా? కొత్త బాస్ వచ్చేదెన్నడు...?
"It is therefore with great regret and an extremely leaden heart that I have decided to sever my half a century old assocation with Indian National Congress," read Ghulam Nabi Azad's resignation letter to Congress interim president Sonia Gandhi pic.twitter.com/X49Epvo1TP
— ANI (@ANI) August 26, 2022
''సోనియా గాంధీ కేవలం నామమాత్రంగానే అధ్యక్ష పదవిలో ఉన్నారు. అన్ని ముఖ్యమైన నిర్ణయాలను రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. అంతకంటే ఘోరంగా ఆయన భద్రతా సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2013కి ముందు పార్టీలో ఉన్న సలహా వ్యవస్థను రాహుల్ గాంధీ నాశనం చేశారు. అనుభవం ఉన్న సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టి అనుభవం లేని నాయకులు పార్టీని నడిపిస్తున్నారు.'' అని తన లేఖలో పేర్కొన్నారు గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్‌లో ఉన్న అత్యంత సీనియర్ నేతల్లో గులాం నబీ ఆజాద్ కూడా ఒకరు. పార్టీతో ఆయనకు 50 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి కీలక నేత రాజీనామా చేయడం.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సంచలనం రేపుతోంది.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ గుండెపోటుతో చనిపోలేదు..అత్యాచారం చేసి చంపేశారు!
2020లో కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది అసమ్మతి వర్గం నేతల్లో గులాం నబీ ఆజాద్ సైతం ఉన్నారు. జీ-23గా పేరున్న సీనియర్ నేతల బృందం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారు లేఖ రాయడంపై అప్పట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను రచ్చకీడుస్తున్నారని మండిపడ్డారు.అప్పటి నుంచీ గులాం నబీ ఆజాద్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీతో ఉన్న 50 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ.. హస్తం పార్టీని వీడారు.
వాస్తవానికి సెప్టెంబరు 21 నాటికి కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు (Congress New President) రావాల్సి ఉంది. పార్టీలో ఎన్నికలు నిర్వహించిన కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. డెడ్‌లైన్‌కు ముందు ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎవరు తీసుకుంటున్నారన్న దానిపై స్పష్టత రాపోకవడంతో.. డెడ్‌లైన్‌ను మరో నెల పాటు పొడిగించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీపావళి పండగ తర్వాతే ఎన్నిక జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఈ ఆదివారం సీడబ్ల్యూసీ చర్చించనుంది. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. దానిని రెండు రోజుల ముందే పార్టీకి గుడ్‌బై చెప్పారు ఆజాద్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Ghulam Nabi Azad, Rahul Gandhi, Sonia Gandhi